దేశంలో ఈ మధ్య కాలంలో వివాహాలు( Weddings ) ఎంత భారీగా జరుగుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు.ఏమాత్రం డబ్బులు వున్నవారు కూడా తమ పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకోవాలని అనుకుంటారు.
ఈ క్రమంలో యువతి యువకులు.ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్న పరిస్థితి.
ఇక దానిని బాగా క్యాష్ చేసుకుంటున్నారు ఫోటో, వీడియో గ్రాఫర్స్.వీరైతే ఏదో సినిమాలు తీసే మాదిరి కొత్త కొత్త ప్రదేశాల్లో వింత వింత ఫోజులతో ఫోటోలు, వీడియోలు తీస్తూ వుంటారు.
ఇపుడు అలా తీసిన వీడియోలు కొందరు ఔత్సాహికులు సోషల్ మీడియాలో( Social Media ) పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.కాగా ఈ వీడియో వీటన్నింటికీ భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు.ఇందులో పెళ్లికూతురు( Bride ) తన సామర్థ్యానికి మించిన పని చేసిందని చెప్పుకోవచ్చు.
వెడ్డింగ్ లెహంగా వేసుకున్న వధువు సరిగ్గా నడవలేని పరిస్థితులు ఉంటాయి.అయితే ఈ వధువు మాత్రం ఫోటో కోసం అద్భుతం చేసిందని చెప్పుకోవచ్చు.
ఆమె హనీ సింగ్( Honey Singh ) పాటలో లెహంగా ధరించి మరీ స్టంట్ చేసింది.కాగా ఈ స్టైల్‌లో పెళ్లికూతురును చూసి అందరూ షాక్ అవుతున్నారు.
దాంతో ఇంటర్‌నెట్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో( Instagram ) జీవర్ బ్రైడ్ అనే ఖాతా ద్వారా పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది.కాగా దీనిని “ఇది ఏ భంగిమ తల్లి?” అనే క్యాప్షన్‌తో షేర్ చేయడం కొసమెరుపు.ఆగస్టు 8న షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 37 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.
ఎర్రటి లెహంగా ధరించిన ఒక అమ్మాయి అబ్బాయితో నిలబడి ఉండటం, ఆ మరుసటి క్షణం ఆ వరుడు బ్యాలెన్స్ చేస్తూ లేచి నిలబడి ఉండడం గమనించవచ్చు.తరువాత వెంటనే వధువు తన ఒక కాలును అతని తొడపై, మరొకటి అతని మెడపై పెట్టి పైకెక్కింది.
అంతేకాకుండా ఆమె నవ్వుతూ ఫోటోలకు పోజులివ్వడం విశేషం.కాగా జనాలు ఈ వీడియోను బాగా ఎంజాయ్ చేశారు.