విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.స్టెల్లా కాలేజ్ సమీపంలో ఉన్న టీవీఎస్ షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో షో రూమ్ లోని సుమారు ఐదు వందల బైకులు కాలి బూడిదయ్యాయని తెలుస్తోంది.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
కాగా ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అధికారులు భావిస్తున్నారు.విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్ వాహన డీలర్లకు ఇదే ప్రధాన కార్యాలయమని తెలుస్తోంది.
ఒకే ప్రాంగణంలో గోదాం, షోరూమ్ మరియు సర్వీస్ సెంటర్ ఉండటంతో భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ఉంటాయి.ఈ క్రమంలోనే అగ్నిప్రమాదం సంభవించడంతో ఎక్కువ సంఖ్యలో బైకులు దగ్ధం అయ్యాయని అధికారులు భావిస్తున్నారు.