గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) కాంగ్రెస్ వీడనున్నారని, ఆయన బిఆర్‌ఎస్ లోకి చేరేందుకు సిద్దమౌతున్నారని ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి.అయితే వాటన్నిటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండిస్తూ వచ్చారు.
తాను పార్టీ మాడడం లేదని అవన్నీ అవాస్తవాలని నిన్నమొన్నటి వరకు చెబుతూ వచ్చారు.కానీ ఇప్పుడు అసలు విషయం చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.
తనకు బిఆర్‌ఎస్ నుంచి ఆఫర్ వచ్చిందని, బిఆర్‌ఎస్ పార్టీ లోని కొందరు నేతలు తనను బిఆర్‌ఎస్ లో చేరాలని కోరారని ఉత్తమ్ చెప్పుకొచ్చారు.
అయితే తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విడిచేదే లేదని ఆయన చెప్పారట.కాగా నిన్న మొన్నటి వరకు తనతో బిఆర్‌ఎస్ నేతలు జరిపిన సంప్రదింపులను రహస్యంగా ఉంచిన ఉత్తమ్ సడన్ గా ఇప్పుడు బహిర్గతం చేశారు.టి కాంగ్రెస్ లో కొత్త చర్చ మొదలైంది.
పార్టీలోని కొందరు నేతల విషయంలో గత కొన్నాళ్లుగా పార్టీ మారతారనే వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు జగ్గారెడ్డి( Jagga Reddy ) పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది.
దీంతో జగ్గారెడ్డితో కూడా బిఆర్‌ఎస్ శ్రేణులు సంప్రదింపులు జరిపి ఉండవచ్చా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.ఇక పార్టీలోని మరికొంత మంది నేతలుపై అగ్రనేతలకు కొంత అనుమానాలు ఉన్నాయట.
ఎన్నికలు దగ్గర పడే కొద్ది తమ పార్టీ నుంచి అభ్యర్థులను లాక్కునేందుకు కేసిఆర్( CM KCR ) వ్యూహాలు రచించే అవకాశం ఉందని.పార్టీ పిరాయింపులకు మొగ్గు చూపే హస్తం నేతలపై అధిష్టానం ఓ కన్నెసినట్లు తెలుస్తోంది.మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో బిఆర్‌ఎస్ సంప్రదింపులు జరిపినట్లు తెలియడంతో కాంగ్రెస్ అలెర్ట్ అయిందట.ఏ ఒక్కరూ కూడా ఇతర పార్టీలవైపు వెళ్లకుండా టి కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక వచ్చే నెల మొదటి వారంలో లేదా రెండో వారంలో అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.సీట్లు దక్కని వారు పార్టీకి ఝలక్ ఇచ్చే అవకాశం ఉంటే వారిని ఎలా బుజ్జగించాలనే దానిపై కూడా హస్తం నేతలు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరి టి పిరాయింపులపై ఎలా దృష్టి సారిస్తుందో చూడాలి.