ఆసియా కప్ 2023( Asia Cup 2023 ) పాకిస్తాన్, శ్రీలంక వేదికలపై ఆగస్టు 30న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) భారత్ వేదికగా అక్టోబర్ ఐదు న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
అయితే భారత సెలెక్టర్లు ఈ రెండు టొర్నీలలో అవకాశం ఇవ్వకుండా ఇద్దరు ఆటగాళ్లను పక్కకు తప్పించే అవకాశం ఉంది.దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్ల కెరీర్ దాదాపుగా ముగిసినట్టే.
పెద్ద టోర్నీలలో మంచి రికార్డ్స్ ఉన్న భారత బ్యాట్స్ మెన్ లలో శిఖర్ ధావన్ కు ప్రత్యేక స్థానం ఉంది.చాలాకాలంగా శిఖర్ ధావన్ కు భారత జట్టులో అవకాశాలు రావడం లేదు.
ఇక ఈ ఏడాది జరగనున్న టోర్నీలలో శిఖర్ ధావన్ ఎంపిక కావడం చాలా కష్టం.
2023 ప్రపంచ కప్ జట్టు గురించి మాట్లాడితే రోహిత్ శర్మ ఓపెనింగ్ పార్టనర్ గా శుబ్ మన్ గిల్( Shubman Gill ) ఉండే అవకాశం కనిపిస్తోంది.శుబ్ మన్ గిల్ తరువాత యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ లాంటి బ్యాట్స్ మెన్లు వరుసగా బరిలోకి దిగుతారు.ఇలాంటి పరిస్థితులలో ప్రపంచ కప్ కు శిఖర్ ధావన్( Sikhar Dhawan ) ఎంపిక కావడం కష్టమే.
ఆసియా కప్ జట్టు నుండి కూడా శిఖర్ ధావన్ ను తప్పించారు.ఇక మరొక బ్యాట్స్ మెన్ పృథ్వీ షా కు కూడా చాలా రోజులుగా భారత జట్టులో అవకాశం దక్కట్లేదు.
ఒకరకంగా పృథ్వీ షా( Prudhvi Shaw ) బ్యాటింగ్ వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్ తీరును పోలి ఉండేది.పృథ్వీ షా దూకుడుగా ఆడే బ్యాట్స్ మెన్.ఇటీవలే జరిగిన ఇంగ్లండ్ వన్డే కప్ 2023లో నార్తాంప్టన్ షైర్- సోమర్ సెట్ మధ్య జరిగిన మ్యాచ్ లో నార్తాంప్టన్ షైర్ తరపున 153 బంతుల్లో 244 పరుగులు చేశాడు.ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా కూడా 2023 ప్రపంచ కప్ కు పృథ్వీ షా ఎంపిక కావడం అసాధ్యం.
దీనికి ఇతని ఫిట్నెస్ ఒక ప్రధాన కారణం.కాబట్టి శిఖర్ ధావన్, పృథ్వీ షా ల కెరీర్ దాదాపుగా ముగిసినట్టే.