ప్రస్తుతం విడుదల అవ్వబోతున్న పాన్ ఇండియన్ సినిమాలలో అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘సలార్’.( Salaar ) యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ని( Prabhas ) అభిమానులు ఎలా అయితే చూడాలని కోరుకుంటున్నారో, అలా చూపించే ప్రయత్నం చేసాడు ఈ చిత్రం లో ప్రశాంత్ నీల్.
( Prasanth Neel ) కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఆయన చేస్తున్న చిత్రం కావడం తో ఈ మూవీ పై ట్రేడ్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.సెప్టెంబర్ 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కాసేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి.
ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
ఈ చిత్రాన్ని అమెరికా లో( America ) ప్రత్యంగిరా సినిమాస్ గ్రాండ్ గా కనీవినీ ఎరుగని రేంజ్ లో విడుదల చేస్తున్నారు.
ఏ రేంజ్ లో అంటే ఆ వారం లో ఏదైనా హాలీవుడ్ సినిమాలు విడుదల అయ్యే విధంగా ఉంటే సలార్ దెబ్బకి ఆ సినిమాలు కూడా వాయిదా వేసుకునే రేంజ్ లో అన్నమాట.అమెరికా లో ప్రఖ్యాత గాంచిన రెగల్ మరియు సినీ మార్క్ లొకేషన్స్ అన్నిట్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది.
అంటే దాదాపుగా ఆరోజు నార్త్ అమెరికా లో ఉన్న అన్నీ థియేటర్స్ లో ‘సలార్’ చిత్రం మాత్రమే ఆడుతూ ఉంటుంది అన్నమాట.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి నార్త్ అమెరికా లో 300 షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్( Salaar Advance Bookings ) ప్రారంభించగా, వాటి నుండి దాదాపుగా అప్పుడే 3000 కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.వీటి నుండి దాదాపుగా లక్షకి డాలర్స్ కి పైగా గ్రాస్ వసూళ్ళు వచ్చినట్టు సమాచారం.ఇదే రేంజ్ ట్రెండ్ ని కొనసాగిస్తూ ముందుకు దూసుకుపోతే ఈ చిత్రం #RRR మూవీ( RRR Movie ) ప్రీమియర్స్ షోస్ గ్రాస్ ని అవలీలగా బద్దలు కొడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
#RRR మూవీ కి ప్రీమియర్ షోస్ నుండి దాదాపుగా 3 మిలియన్ డాలర్ల వసూళ్లు వస్తాయని అందరూ అనుకుంటున్నారు.
ఇప్పటి వరకు రాజమౌళి కాకుండా నార్త్ అమెరికా లో ప్రీమియర్ షోస్ నుండి 1 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టిన హీరోలు కేవలం చిరంజీవి, పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు మాత్రమే.ఇప్పుడు ప్రభాస్ కూడా ఆ లిస్ట్ లోకి అతి త్వరలోనే జాయిన్ అవ్వబోతున్నాడు.ఒకవేళ ఈ చిత్రం రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొడితే భవిష్యత్తులో మహేష్ బాబు గుంటూరు కారం, ( Guntur Karam Movie ) మరియు పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రాలకు( OG Movie ) ఆ రికార్డ్స్ ని అధిగమించే ఛాన్స్ ఉంటుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.
చూడాలి మరి.