కొన్ని నెలల్లో తెలంగాణలో ఎన్నికల నగారా మోగబోతోంది.దీంతో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు మొదలైంది.
మరో మారు టికెట్లు వస్తాయా రావా అనే ఆలోచనల్లో పడ్డారు.ఇక బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో జనగామ టికెట్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి( Muttireddy Yadagiri Reddy ) ) ఈసారి కష్టమే అనిపిస్తుంది.
జనగామ నియోజకవర్గం నుంచి చాలామంది కీలక నేతలు ముత్తిరెడ్డికి తెలియకుండా హైదరాబాద్ హోటల్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.ఈ సమావేశమంతా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కనసన్నాల్లో జరిగినట్టు తెలుస్తోంది.

రాబోవు ఎన్నికల్లో తప్పనిసరిగా ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి( MLC Palla Rajeswar Reddy ) జనగామ ఎమ్మెల్యే టికెట్ తీసుకోబోతున్నట్లు సమాచారం.అయితే అప్పట్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీకి(MLC) పోటీ చేసి గెలుపొందారు.అయితే ఈయనకు పోటీలో తీన్మార్ మల్లన్న( Teenmaar Mallanna ) ఉన్నారు.అయితే ఈ ఎలక్షన్లలో రాజేశ్వర్ రెడ్డికి మరియు తీన్మార్ మల్లన్నకు హోరాహోరీ పోరు జరిగింది.
చివరి వరకు నువ్వా నేనా అనే విధంగా సాగింది.

ఇక చివరిలో కొద్దిపాటి తేడాతో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు.ఇదే తరుణంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎలాగైనా ఈసారి ఎమ్మెల్యే టికెట్ కోసం కేసీఆర్( KCR ) చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు తెలుస్తోంది.కేసీఆర్ కూడా ఆయనకు జనగామ టికెట్ పై హామీ ఇచ్చినట్టు సమాచారం.
ఒకవేళ జనగామ టికెట్ వచ్చి, పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేసి గెలుపొందితే , తప్పనిసరిగా తీన్మార్ మల్లన్నకు మరోసారి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఉంటుంది.ఇప్పటికే ఆయన ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి , మరోసారి పోటీ చేస్తే సింపతితో తప్పనిసరిగా గెలిచే అవకాశం 100%ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.