మరో మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్( Telangana Election notification ) విడుదలవుతుందన్న అంచనాల నడుమ మూడు ప్రధాన పార్టీలు తమ పూర్తిస్థాయి శక్తియుక్తులను ప్రదర్శించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది.తమబలాలను బలహీనతలను అంతిమంగా బేరీజు వేసుకుంటున్న పార్టీలు స్క్రిప్ట్ వర్క్ ని ఇప్పటికే పూర్తి చేసుకున్నాయి.
ఏ ఏ అంశాల మీద ప్రజల్లోకి వెళ్లాలి ప్రభుత్వ వైఫల్యాలు ఏమిటి ? వాటిలో ప్రధాన స్పందన వచ్చే విషయాలు ఏమిటి అంటూ హైలెట్ చేసుకుంటున్న ప్రతిపక్షాలు దానిపై పూర్తిస్థాయి యుద్ధభేరి మోగించడానికి రంగం సిద్ధం చేసుకుంటుంటే మరో పక్క అధికారపక్షం ఏ వర్గాలను ఎలా ఆకట్టుకోవాలి ఏ వర్గానికి ఎలాంటి వరాలు కురిపించాలి.ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి వాటిని ఎలా సవరించుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది .
ఇప్పటివరకు ఆలోచనలకే పరిమితమైన పార్టీలు ఇప్పుడు పూర్తిస్థాయి యాక్షన్ మోడ్ లోకి దిగాయి ఎన్నికల నోటిఫికేషన్ మొదలవకుండానే ప్రచార పర్వానికి తెరతీస్తున్నాయి.ఇప్పటికే బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు( K.T.Rama Rao ) తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.సిరిసిల్ల కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సారంపల్లి అన్న ఊర్లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంబించినట్టు చెప్పిన కేటీఆర్ ఇక్కడ సర్దార్ పాపన్న గౌడ్( Sardar Papanna goud ) విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన ఆశీస్సులతో ఎన్నికల క్షేత్రంలో ముందుకు వెళుతున్నట్లుగా చెప్పుకొచ్చారు.గడచిన ఎన్నికలలో 89వేల ఓట్ల ఆధిక్యం తెచ్చుకున్న కేటీఆర్ ఈసారి సిరిసిల్లలో లక్ష ఓట్ల మెజారిటీ పై కన్నేసినట్లుగా తెలుస్తుంది.
ప్రజల ఆశీస్సులు ప్రభుత్వ అభివృద్ధిపై ఓటర్ల నమ్మకంతో ఈసారి లక్ష మేజారిటీ ఫీట్ను సుసాధ్యం చేస్తానంటున్నారు కేటీఆర్.మరో పక్క ప్రతిపక్షాలు కూడా పూర్తిస్థాయిలో ఎన్నికల సమరభేరికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది.ఇలా తమవైన ఏర్పాట్లతో తెలంగాణ రాజకీయ రంగంలో మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల నగారాను మోగించినట్లుగా హడావిడిని కనిపిస్తుంది.