ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఆయా హీరోల కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సినిమాలను మరొకసారి థియేటర్ లలో రీ రిలీజ్ చేస్తున్నారు.
సూపర్ హిట్ అయిన సినిమాలు మాత్రమే కాకుండా ఫ్లాప్ అయిన సినిమాలు కూడా విడుదల చేస్తున్నారు.ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ బాగా ఎక్కువ అయ్యింది.
కాగా ఇప్పటికే, ఆరెంజ్,( Orange ) జల్సా, ఖుషి, ఒక్కడు, మురారి,( Murari ) ఆది, త్రీ, బిల్లా లాంటి సినిమాలతో పాటు ఇంకా చాలా సినిమాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే రీ రిలీజ్ లో విడుదల అయ్యే సినిమాలు ఇప్పటికే టీవీలలో, మైబైల్ లో చాలా సార్లు చూసిన సినిమాలే, అయినప్పటికీ రీ రిలీజ్ అయ్యి భారీగా కలెక్షన్స్ ని రాబడుతున్నాయి.ఇది ఇలా ఉంటే ప్రేక్షకుల ముందుకు మరో సినిమా రీ రిలీజ్ కాబోతోంది.పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్( Ram charan ) నటించిన సూపర్ హిట్ మూవీ నాయక్ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారట.
ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే.ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా నాయక్ ( Nayak movie )ని రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో మెగా అభిమానులు మరోసారి చరణ్ డ్యూయల్ రోల్ ధమాకా చూసేందుకు సిద్ధమవుతున్నారు.

వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2013 లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది.ఈ సినిమాలోనే రామ్ చరణ్ మొదటిసారి డ్యూయల్ రోల్ చేశాడు.చెర్రీగా లవ్ అండ్ కామెడీతో ఎంటర్టైన్ చేస్తూనే, సిద్దార్థ్ నాయక్ గా యాక్షన్ సీన్స్ తో ఆడియన్స్ తో విజుల్స్ వేయించాడు.
ఇక చరణ్ కి జోడిగా కాజల్ అగర్వాల్, అమల పాల్ నటించిన విషయం తెలిసిందే.అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు ఈ సినిమాలోని పాటలు కొన్ని రోజులు పాటు ఎక్కడ చూసినా కూడా మారుమోగిన విషయం తెలిసిందే.
కాగా మెగా అభిమానులు ఈ మూవీ విడుదల అవుతుంది అని సంతోషం పడే లోపే మూవీ మేకర్స్ ఒక బ్యాడ్ న్యూస్ తెలిపారు.నాయక్ సినిమాను రీ రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ మళ్లీ వెంటనే ఈ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లినట్టుగా తెలియజేసి మెగా ఫ్యాన్స్ అందరికీ క్లారిటీ ఇచ్చారు.
నిర్మాతలు గాని మరే ఇతర వ్యక్తులు కానీ సినిమా రీ రిలీజ్ చేయడం లేదు అని దీనిని అంతా దృష్టిలో పెట్టుకోవాలి అని తెలిపారు.