సోషల్ మీడియా పుణ్యమాని వింత వింత విషయాలు తెలుసుకోగలుగుతున్నాం.మనలో చాలామందికి టాయిలెట్( Toilet ) అంటే చాలా క్రేజ్.
కొందరు టాయిలెట్‌లో కూడా మొబైల్ వాడుతూ ఎంత సేపైన అక్కడే ఉండిపోతారు.స్నానం అయితే గంటలు గంటలు చేస్తూ వుంటారు.
బయటి ప్రపంచంతో వారికి సంబంధం లేనట్టుగా వాష్‌రూమ్‌లోనే ఉంటారు.మరి అలా స్నానం చేసినపుడు హఠాత్తుగా ఓ పాము ( Snake ) మీమీద పడితే ఎలా ఉంటుంది? ఊహించడానికే కష్టంగా వుంది కదూ.ఇక్కడ అదే జరిగింది.వర్షాకాలం.
కావడంతో క్రిమీ కీటకాదులు, పాముల వంటివి మురికి కాల్వల గుండా కొట్టుకువస్తుంటాయి.గ్రామాల్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు.

మరి అలా వచ్చిందేమోగానీ ఒక బాత్ రూములో( Bathroom ) పాముకి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.రాత్రిపూట లైట్ వేయకుండా టాయిలెట్‌కు వెళ్లవద్దని పెద్దలు సలహా ఇస్తూ వుంటారు.ఎందుకంటే.అక్కడ పైకప్పుపైనే పాము ఉండొచ్చు.లేదంటే.కమోడ్ రంధ్రం నుండి కూడా పాములు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
ఈ వైరల్ వార్తే దానికి నిదర్శనం.అలాంటి ఘటనే అరిజోనాలో( Arizona ) చోటుచేసుకోగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.4 రోజుల సెలవు తర్వాత, ఆ ఇంటి యజమానురాలు.తన ఇంటికి వచ్చినప్పుడు, ఆమె టాయిలెట్‌కు వెళ్లింది.
కట్ చేస్తే అక్కడ కనిపించిన షాకింగ్ సీన్ చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయింది.

అక్కడ ఏదో నల్లటి ఆకారాన్ని నిశితంగా పరిశీలిస్తే అది పాము అని తెలుసుకుంది.పాము కనిపించిన ఇంట్లో ఉన్న ఆ మహిళ పేరు మిచెల్ లెస్ప్రాన్.( Michelle Lespron ) లెస్ప్రాన్ సెలవుపై బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత టాయిలెట్‌కు వెళ్లగా ఈ దృశ్యం చోటుచేసుకుంది.
కమోడ్ హోల్‌లో నల్లపాము చిక్కుకుపోయి కనిపించింది.పామును తరిమికొట్టేందుకు లెస్ప్రేన్ చాలా ప్రయత్నాలు చేసింది.కానీ ఆమె వలన కాలేదు.దీంతో పెస్ట్ కంట్రోల్ కంపెనీ రాటిల్ స్నేక్ సొల్యూషన్స్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.







