రీసెంట్ గా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ ( Bhola Shankar )చోప్త్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండి డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వస్తుందని ఫ్యాన్స్ ముందు నుండే ఊహించారు.
ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం విడుదలైన సినిమాకి రీమేక్, అందులోనూ మెహర్ రమేష్ ( Meher Ramesh )లాంటి దర్శకుడు అవ్వడం తో అంచనాలు పెట్టుకోలేదు ఫ్యాన్స్.దానికి తోడు ఈ చిత్రానికి పబ్లిసిటీ కూడా గొప్పగా చెయ్యలేదు.
ఫలితంగా కనీవినీ ఎరుగని రేంజ్ ఫ్లాప్ గా నిల్చింది ఈ చిత్రం.మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకి చిన్న హీరో డిజాస్టర్ సినిమాకి వచ్చినంత వసూళ్లు కూడా రావడం లేదు.
ఇది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న చిరంజీవి కి అవమానకరం అని చెప్పొచ్చు.
అయితే ఇంత పెద్ద డిజాస్టర్ తగిలిన తర్వాత కూడా నిర్మాత అనిల్ సుంకర( Producer Anil Sunkara ) చిరంజీవి మీద కానీ, సినిమా మీద అసంతృప్తి చెందడం కానీ అసలు ఏమి చెయ్యలేదు.ఈ సినిమా మిస్ అయ్యింది , మళ్ళీ చిరంజీవి తో సినిమా తీస్తాం, సినిమాతోనే అందరికీ సమాధానం చెప్తాం అంటూ ఫ్యాన్స్ లో ధైర్యం నింపాడు.ఇకపోతే చిరంజీవి తో తదుపరి చిత్రం పాన్ ఇండియన్ సినిమా గా అనిల్ సుంకర తియ్యబోతున్నట్టు సమాచారం.
ఈ చిత్రానికి డైరెక్టర్ కూడా పాన్ ఇండియన్ క్రేజ్ ఉన్నవాడే అని తెలుస్తుంది.కమల్ హాసన్ కి విక్రమ్, రజినీకాంత్ కి జైలర్ తరహా సినిమాలు ఎలా అయితే ల్యాండ్ మార్క్ గా కెరీర్స్ లో నిలిచాయో, అలాంటి ప్రాజెక్ట్ ని చేయబోతున్నాడట అనిల్ సుంకర.
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నాడు, దీనికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించబోతున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో మరో హీరో కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.బడ్జెట్ దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందట.తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం భాషల్లో కూడా విడుదల కాబోతుంది ఈ చిత్రం.
ఇకపోతే మెగాస్టార్ తదుపరి సినిమా భింబిసారా మూవీ డైరెక్టర్ వసిష్ఠ తో ఉండబోతుంది.ఇది కూడా భారీ బడ్జెట్ సినిమానే, కూతురు ని వెతుక్కుంటూ తండ్రి చేసే ప్రయాణమే ఈ చిత్ర కథ సారాంశం అట.చిరంజీవి చాలా కాలం తర్వాత వయస్సుకి తగ్గ పాత్రని పోషిస్తున్నాడు.నవంబర్ నుండి షూటింగ్ ప్రారంభం కానుంది.