భారత హాకీ జట్టు ఏకంగా 8 సార్లు ఒలంపిక్స్ విజేతగా నిలిచింది.తాజాగా ప్రపంచంలోనే మూడో అత్యుత్తమ జట్టుగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.
హాకీ చరిత్రలో భారత్ తొలిసారి ప్రపంచ హాకీ సమాఖ్య ర్యాంకింగ్స్ లో మూడవ స్థానానికి చేరుకుంది.గత సంవత్సరంలో ప్రపంచ ఐదవ ర్యాంకు జట్టుగా నిలిచిన భారత్.
కేవలం కొద్ది రోజులలోనే నాల్గవ ర్యాంకు ఎదిగింది.ఇటీవల చెన్నై వేదికగా జరిగిన 2023 ఆసియా చాంపియన్స్( Asian Champions Trophy ) ట్రోఫీ టోర్నీలో భారత్ అజేయంగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకోవడం వల్ల ప్రపంచ మూడో ర్యాంకు చేరింది.
ఇప్పటివరకు ప్రపంచ పురుషుల హాకీ ర్యాంకింగ్స్ లో మూడో ర్యాంకులో ఉంటూ వచ్చిన ఇంగ్లాండ్ ను భారత్ 2771.35 పాయింట్లతో అధిగమించడం వల్ల భారత్ మూడవ ర్యాంకులో,ఇంగ్లాండ్ /em>( England )నాలుగో ర్యాంకులు నిలిచాయి.2021 టోక్యో వేదికగా జరిగిన ఒలంపిక్స్ లో భారత్ కాంస్య పతకం గెలిచి, అప్పటినుంచి ప్రపంచ స్థాయి పోటీలతోపాటు ఆసియా టోర్నీలలోనూ వరుస విజయాలతో నెంబర్ వన్ జట్టుగా నిలిచింది.
ఒలంపిక్స్ నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.పురుషుల హాకీలో అత్యధికంగా ఎనిమిది బంగారు పథకాలు సాధించిన ఏకైక జట్టు మన భారతదేశం మాత్రమే.నాలుగు దశాబ్దాల విరామం తర్వాత మళ్లీ టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించడం వల్ల ప్రపంచ మేటి జట్లలో భారత హాకీ జట్టు ఒకటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.2021 నుంచి భారత హాకీ జట్టు తన ఆటతీరును మెరుగుపరుచుకుంటూ ముందుకు పోతూనే ఉంది.ఆసియా చాంపియన్స్ ట్రోఫీని నాలుగో సారి గెలుచుకున్నాం భారత హాకీ జట్టు సెప్టెంబర్ 23 నుంచి చైనా నగరం హంగ్జు వేదికగా ప్రారంభం అవ్వనున్న ఆసియా క్రీడల హాకీలో పాల్గొననుంది.
ఈ క్రీడలలో పాల్గొని బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.