టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య( Nagachaitanya ) ఈమధ్య కాలంలో ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోతున్నారని చెప్పాలి.ఈయన శేఖర్ కమ్ముల ( Sekhar Kammula ) దర్శకత్వంలో లవ్ స్టోరీ ( Love Story )సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్ అందుకోలేదని చెప్పాలి.
ఈ క్రమంలోనే వచ్చే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో నాగచైతన్య తన తదుపరి ప్రాజెక్టుపై పూర్తి ఫోకస్ పెట్టారని తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
అయితే ఈ ప్రీ ప్రొడక్షన్ పనులలో భాగంగా చిత్ర బృందం స్వయంగా పలు ప్రాంతాలను పర్యటిస్తూ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారని తెలుస్తోంది.
నాగచైతన్య తన తదుపరిచిత్రాన్ని చందు మొండేటి( Chandu Mondeti ) దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్( Allu Aravind ) నిర్మిస్తున్న సినిమాలో నటించబోతున్నారు.ఈ సినిమా ఒక జాలరీ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో జాలరి జీవితం ఎలా ఉండబోతోంది అనే విషయాలన్నింటినీ నాగచైతన్య స్వయంగా పలు మత్సకారుల ప్రదేశాలకు వెళ్తూ వారితో మాట్లాడి అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు.ఈ క్రమంలోనే డైరెక్టర్, హీరో నిర్మాత బన్నీ వాసు శ్రీకాకుళంలోని కె.మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించింది.
ఈసందర్భంగా నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.హైదరాబాద్‌లో కూర్చొని ఈ కథను రూపొందిచడం కాదని దర్శకుడు భావించారు.అందుకే సరాసరి ఇక్కడికి వచ్చి జాలర్ల వాతావరణాన్ని అధ్యాయనం చేస్తూ ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా పనులు మొదలుపెట్టినట్లు తెలిపారు.ఇక దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ.‘ఈ గ్రామానికి వచ్చి ప్రతి అంశానికి సంబంధించిన వివరాలను పరిశీలించిన తర్వాత మా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యిందనీ తెలిపారు.ఏది ఏమైనా ఈసారి ఎలాగైనా నాగచైతన్యకు సూపర్ హిట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే దర్శక నిర్మాతలు ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది.