ప్రజా గాయకుడు గద్దర్ మృతిపట్ల తెలంగాణ మావోయిస్ట్ పార్టీ సంతాపం తెలిపింది.గద్దర్ మరణ వార్త తమను తీవ్రంగా బాధించిందని తెలంగాణ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు.
గద్దర్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి జగన్ పేర్కొన్నారు.జననాట్యమండలి ఏర్పాటులో గద్దర్ కృషి ఉందని మావోయిస్ట్ పార్టీ తెలిపింది.1972 నుంచి గద్దర్ విప్లవ ప్రస్థానం మొదలై 2012 వరకు కొనసాగిందన్నారు.భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో గద్దర్ కీలక పాత్ర పోషించారన్న మావోయిస్ట్ పార్టీ తెలంగాణలో ఉద్యమంలో కూడా గద్దర్ పాల్గొన్నారని వెల్లడించారు.1997 లో నల్లదండు ముఠా పోలీసుల కాల్పుల్లో గద్దర్ శరీరంలోకి ఐదు తూటాలు దూసుకెళ్లినా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని తెలిపారు.గద్దర్ చివరి కాలంలో పార్టీ నిబంధనలకు విరుద్ధంగా పాలక పార్టీలతో కలవడంతో తమ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చిందన్నారు.
దీంతో 2021లో పార్టీ సభ్యత్వానికి గద్దర్ రాజీనామా చేశారని తెలిపారు.