ఈ బ్యాగ్ ధరతో బిఎండబ్ల్యూ కారునే కొనొచ్చు.. అంత స్పెషల్ ఎందుకంటే?

ఈ ప్రపంచంలో కళ అనేది ఎవడబ్బ సొత్తు కాదు.ప్రంపచ వ్యాప్తంగా ఎంతో మంది కళాకారులు వెలుగొందుతున్న.

 World's Smallest Gold Handbag Made Of 24 Carat Gold,iqbal Sakka, Goldn Bag, Smal-TeluguStop.com

అయితే, ప్రపంచం మొత్తం గౌరవించే ప్రతిభ ఉన్న కళాకారులు మన దేశంలో కూడా చాలామంది వున్నారు.అందుకు నిదర్శనమైన ఎన్నో కళాకండాలు మన దేశంలో కొలువు దీరాయి.

తాజాగా ఉదయ్‌పూర్‌కు చెందిన డాక్టర్ ఇక్బాల్ సక్కా( Doctor Iqbal Sakka ) అలాంటి ఓ అద్భుతాన్నే సృష్టించారు.దాన్ని చూసిన ప్రజలు భళా అని ఆశ్చర్యపోతున్నారు.

అవును, ఇక్బాల్ సక్కా ప్రపంచంలోనే అతి చిన్న బ్యాగ్‌ని తయారు చేశాడు.దీనిని చూడటానికి తప్పకుండా లెన్స్ పెట్టుకోవలసిన అవసరం ఉంటుంది మరి.

Telugu Expensive Bag, Goldn Bag, Guinness, Iqbal Sakka, Smallest Bag-Latest News

కట్ చేస్తే ఈ చిన్ని బ్యాగ్ ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌( Guinness Book of World Records )లో నమోదైంది.ఇంతకు ముందు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి అతి చిన్న బ్యాగ్ తయారు చేసి రికార్డుల్లోకెక్కగా ఆ బ్యాగ్‌ కంటే కూడా చిన్న బ్యాగ్‌ను ఇక్బాల్ సక్కా ఇప్పుడు తయారు చేసి మనోడి దాన్ని బ్రేక్ చేసాడు.అయితే, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ను మించి మరో ప్రత్యేకత ఈ బ్యాగ్‌కు ఉండడం కొసమెరుపు.అదేంటంటే.ఈ బ్యాగ్‌ ధరతో ఏకంగా ఓ బీఎండబ్ల్యూ కారునే కొనుగోలు చేయొచ్చు మరి.ఎందుకంటే, ఈ బ్యాగ్‌ని 24 క్యారెట్ల బంగారం( Small Gold Bag )తో ఇక్బాల్ సక్కా తయారు చేశాడు.

Telugu Expensive Bag, Goldn Bag, Guinness, Iqbal Sakka, Smallest Bag-Latest News

ఈ బ్యాగ్ పొడవు విషయానికి వస్తే.ఇది కేవలం 0.02 అంగుళాలు మాత్రమే ఉంది.అంటే ఈ బ్యాగ్ చక్కెర స్పటిక కంటే చిన్నదిగా ఉంటుంది.

న్యూయార్క్‌( New York )లో తయారు చేసిన ప్రపంచంలోనే అతి చిన్న బ్యాగ్ కంటే కూడా చిన్నది కావడం విశేషం.దీని ధర తెలిస్తే జడుసుకుంటారు కూడా.24 క్యారెట్ల మేలిమి బంగారంతో రూపొందించిన ఈ బ్యాగ్‌ను వేలం వేయగా.రూ.54 లక్షలు పలికింది.కాగా ఇక్బాల్ సక్కా ఈ బ్యాగును కేవలం 3 రోజుల్లోనే తయారు చేయడం మరో విశేషం.

అయితే, దీన్ని తయారు చేస్తున్నప్పుడు ఇక్బాల్ సక్కాన తన కంటి చూపును కూడా కోల్పోయాడట పాపం.ఇంత చిన్న బ్యాగ్‌ను తయారు చేయడం అంటే చాలా రిస్క్‌తో కూడిన పని.కళ్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.దాంతో ఇక్బాల్ కంటి చూపు మందగించింది.

అయితే, ఇలాంటి కళాఖండాలు తయారు చేయడం ఇక్బాల్ సక్కాకు కొత్తేమీ కాదు.అతని పేరిట 100 కంటే ఎక్కువ ప్రపంచ రికార్డ్స్ ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube