తన జీవన ప్రయాణంలో అనేక వ్యాపార విజయాలు సాధించిన మూవీ మొఘల్ రామోజీరావుకు( Mughal Ramoji Rao ) అతిపెద్ద ఎదురుదెబ్బగా మారిన మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు ఎట్టకేలకు కొంత ఊరట నిచ్చే తీర్పు వెలువరించింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా పట్టుపట్టడంతో ఆస్తులు అటాచ్మెంట్లు ఢిల్లీలో సిఐడి మీడియా సమావేశాలు, వరుస పెట్టి మార్గదర్శిపై( margadarshi ) కంప్లైంట్ ల పర్వాలు తో రాష్ట్ర వ్యాప్త చర్చగా మారిన మార్గదర్శకేసులో మొదటిసారి మార్గదర్శికి సంస్థకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
మార్గదర్శి కేసును ఆంధ్రప్రదేశ్ పరిధికి మార్చాలని మార్గదర్శకేసును విచారించే పరిధి తెలంగాణ హైకోర్టుకు లేదంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
కేసు దర్యాప్తు తెలంగాణ హైకోర్టులోనే( Telangana High Court ) జరుగుతుందని తమ వాదనను అక్కడే వినిపించాలని తుది తీర్పు వచ్చిన తర్వాత అవసరం అనుకుంటే సుప్రీం కు రావచ్చంటూ ప్రధాన ధర్మాసనం తీర్పునిచ్చింది .అంతేకాకుండా రామోజీరావు పై కానీ ఎండి శైలజ రావు( MD Shailaja Rao ) పై కానీ తీవ్రమైన చర్యలు తీసుకోకూడదు అన్న హైకోర్టు తీర్పును కూడా నిలిపివేయలేమంటూ తేల్చేసింది .దాంతో రామోజీ కుటుంబ సభ్యులకు భారీ ఊరట దక్కినట్లు అయింది.తన తండ్రి హయాం నుంచి తమకు రాజకీయ వ్యతిరేకి గా వ్యవహరిస్తున్న రామోజీరావుకు సరైన గుణపాఠం చెప్పే అవకాశం ఈ కేసు ద్వారా వస్తుందని భావించిన ముఖ్యమంత్రి జగన్( Chief Minister Jagan ) ఈ విషయంపై అన్ని రకాల గానూ పట్టు బిగించాలన్న చేసిన ప్రయత్నాలకు కొంత ఎదురు దెబ్బ తగిలినట్లుగానే భావించవచ్చు.
అయితే ఇవి టెక్నికల్ అవరోధాలు మాత్రమేనని మార్గదర్శి విషయంలో ఖచ్చితమైన సాక్షాదారాలు ఉన్నందున మార్గదర్శికి ఇబ్బందులు తప్పక పోవచ్చు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.రానున్న రోజుల్లో మరింత పకడ్బందీగా వ్యవహరించి ఈ కేసును ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.ఏది ఏమైనప్పటికీ రాజకీయ బలాన్ని చూసుకొని చట్టపు పరిమితులను అతిక్రమిస్తే ఎప్పటికైనా దెబ్బ పడుతుందని మార్గదర్శ వ్యవహారంతో నిరూపణ అయినట్టుగా చెప్పవచ్చు .మరి అవసాన దశలో వచ్చిన ఈ ఉపద్రవాన్ని రామోజీ ఎలా ఎదుర్కొంటారో చూడాలి
.