బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ( Ananya panday )గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల కాలంలో ఆమె తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది.
కాగా ప్రస్తుతం ఆమె డేటింగ్ లో ఉన్నట్లు బాలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.బాలీవుడ్ స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇంతకీ ఆ బాలీవుడ్ హీరో ఎవరు? నిజంగా వీధి మధ్య ప్రేమ నడుస్తోందా అన్న వివరాల్లోకి వెళితే.బాలీవుడ్ స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.
ఎందుకంటే గత నెలలో ఈ జంట ఇటీవల పోర్చుగల్ ట్రిప్‌కు వెళ్లగా అక్కడ వీధులు, రెస్టారెంట్ లలో జంటగా దిగిన ఫోటోలు కాస్తా నెట్టింట దర్శనమిచ్చాయి.దాంతో డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తండ్రి చంకీ పాండే ( Chunky panday )ఈ వార్తలపై స్పందించారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కూతురి రిలేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చేశారు.
ఈ సందర్భంగా చంకీ పాండే మాట్లాడుతూ.నటీనటుల జీవితంలో రిలేషన్స్‌పై రూమర్స్ రావడం అన్నది సర్వ సాధారణమైన విషయం.
మేము గ్లామర్‌లో వృత్తిలో ఉన్నాము.ఇలాంటివన్నీ జరగాల్సినవే.
కెరీర్‌కు ఇది నష్టం కలిగించినప్పటికీ వీటిని మనం కట్టడి చేయలేం.
అనన్య చాలామంది హీరోలతో అద్భుతంగా నటించింది.స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాలో టైగర్ ష్రాఫ్ సరసన, పతి, పత్నీ ఔర్ వో లోని కార్తీక్ ఆర్యన్‌తో సినిమాలు చేసింది.ఆమెకు ఇది ఒక అద్భుతమైన ప్రయాణం.
ఈ విషయంలో నాకు ఎవరినీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు.తనకి నేను చెప్పేది ఒక్కటే,నా కంటే మెరుగ్గా ఉండాలి అని చెబుతూ ఆ వార్తలకు పులిస్టాప్ పెట్టేశారు.
అంతేకాకుండా సోషల్ మీడియాలో వినిపించే వార్తలను నమ్మకండి అని ఇన్ డైరెక్టుగా తెలిపారు.కాగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
కాగా ఇటీవల విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) నటించిన లైగర్( Liger movie ) చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.ఇకపోతే అనన్య పాండే సినిమాల విషయానికి వస్తే.
ప్రస్తుతం ఆమె ఆయుష్మాన్ ఖురానాతో డ్రీమ్ గర్ల్ సీక్వెల్ కోసం సిద్ధమవుతోంది.ఆ తర్వాత విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ మూవీలో నటించనుంది.
ఆదిత్య రాయ్ కపూర్ ది నైట్ మేనేజర్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఈ సిరీస్ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.