చిరు 'బ్రో డాడీ' విషయంలో ఆ మార్పులు.. ఇంట్రెస్టింగ్..!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ శాతం రీమేక్ సినిమాలనే చేస్తూ వస్తున్నాడు.స్ట్రైట్ సినిమాలు చేసింది తక్కువ అనే చెప్పాలి.

 Bro Daddy Telugu Remake This Major Change Executed By The Makers, Bro Daddy Telu-TeluguStop.com

కానీ ప్రేక్షకులు మెగాస్టార్ నుండి రీమేక్ సినిమాలను ఆశించడం లేదు.ఎందుకంటే ఓటిటీ ప్లాట్ ఫామ్ లు వచ్చిన తర్వాత ప్రేక్షకులు అన్ని బాషల సినిమాలను ఓటిటి లోనే వీక్షిస్తున్నారు.

Telugu Bhola Shankar, Bro Daddy, Brodaddy, Chiranjeevi-Movie

దీంతో ఒరిజినల్ సినిమా చూసిన ప్రేక్షకుల్లో అదే సినిమాను రీమేక్ చేయడంతో ఇంట్రెస్ట్ పెట్టడం లేదు.అయినా కూడా చిరు రీమేక్ సినిమాలను ఎంచుకుంటున్నారు.ఈ మధ్య కాలంలో చిరు వాల్తేరు వీరయ్య మాత్రమే స్ట్రైట్ సినిమా చేయగా మిగిలినవన్నీ రీమేక్ సినిమాలే.ప్రజెంట్ చిరు వేదాళం రీమేక్ చేస్తున్నాడు.భోళా శంకర్ ( Bhola Shankar )పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి మరో రీమేక్ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.మెగాస్టార్ ‘బ్రో డాడీ’ రీమేక్ ( BRO Daddy )కూడా చేయబోతున్నారు అని టాక్.

మలయాళ సూపర్ హిట్ అయిన బ్రో డాడీ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేస్తున్నారట.

Telugu Bhola Shankar, Bro Daddy, Brodaddy, Chiranjeevi-Movie

తాజా బజ్ ప్రకారం ఈ సినిమా ఒరిజినల్ లో ఇద్దరు హీరోలు తండ్రి కొడుకులుగా నటించగా ఇప్పుడు మాత్రం తెలుగులో అన్నదమ్ములుగా కనిపిస్తారట.దీంతో తెలుగు వర్షన్ కోసం కథ మొత్తం భారీ మార్పులు చేస్తున్నట్టు టాక్.చూడాలి ఇది ఎంత వరకు నిజమో.

ఇక గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్స్ అందుకున్న తర్వాత భోళా శంకర్ తో హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube