టీడీపీలో సత్తెనపల్లి కుంపటి ?

2024లో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ( TDP ) పట్టుదలగా ఊంది.అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

 Sattenapalli Effect In Tdp , Sattenapally, Tdp , Kodela Shivaram, Kanna Lakshmin-TeluguStop.com

అయితే గెలుపే లక్ష్యంగా ఉన్న టీడీపీకి ఆయా నియోజిక వర్గాలలో వర్గపోరు తలనొప్పిగా మారుతోంది.ముఖ్యంగా సత్తెనపల్లి( Sattenapally ) కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.

గతంలో ఈ నియోజిక వర్గానికి టీడీపీ తరుపున స్పీకర్ గా పని చేసిన దివంగత నేత కోడెల శివప్రసాద్ ప్రాతినిథ్యం వహించారు.అయితే ఆయన మరణాంతరం ఆయన కోడెల శివరాం( Kodela Shivaram ) నియోజిక వర్గంలో కీలకంగా మారే అవకాశం ఉందని భావిచారంతా.

కానీ అలా జరగలేదు.తనకు పార్టీలో సరైన ప్రదాన్యత లభించడం లేదని తన పట్ల టీడీపీ అధిష్టానం చిన్నచూపు చూస్తోందని స్వయంగా కోడెల శివరాం పలుమార్లు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు.

Telugu Ap, Chandrababu, Kodela Shivaram, Circles, Sattenapally-Politics

ఇదిలా ఉండగానే బిజెపి నుంచి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మినారాయణకు( Kanna Lakshminarayana ) అధిక ప్రదాన్యం ఇస్తూ వచ్చింది టీడీపీ అధిష్టానం.ఇప్పటికే కన్నా ను సత్తెనపల్లి( Sattenapally ) టీడీపీ ఇన్ చార్జ్ గా నియమించిన చంద్రబాబు.ఆయనకే టికెట్ కన్ఫర్మ్ చేసే ఆలోచనలో ఉన్నారట.ఇదే ఇప్పుడు సత్తెనపల్లి నియోజిక వర్గంలో కాక పుట్టిస్తున్న అంశం.ఎందుకంటే సత్తెనపల్లి టికెట్ ను కోడెల శివరాం ఆశిస్తున్నారు.కానీ చంద్రబాబు మాత్రం కోడెల శివరాం కు టికెట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని టాక్.

ఇదిలా ఉండగా నియోజిక వర్గ ఇన్ చార్జ్ గా ఉన్న కన్నా లక్ష్మినారాయణకు కోడెల వర్గం సరైన సహకారం అందించడం లేదట.దాంతో అధిష్టానం కోడెల వర్గానికి నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులపై తాజాగా కోడెల శివరాం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Ap, Chandrababu, Kodela Shivaram, Circles, Sattenapally-Politics

దశాబ్దాలు గా పార్టీ కోసం పనిచేసి, పార్టీ జెండా మోసిన వారికి నోటీసులు పంపడం దుర్మార్గమైన చర్య అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.టీడీపీ ఆఫీస్ లో ఇంతవరుకు అడుగు పెట్టని కన్నా లక్ష్మినారాయణకు ఎందుకు నోటీసులివ్వరని ప్రశ్నించారు.సత్తెనపల్లి నియోజిక వర్గంలో కోడెల పేరు వినపడకుండా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని శివరాం ఆరోపించారు.

ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.ఎన్నో రోజులుగా టీడీపీ అధిష్టానం తీరుపై అసహనంగా ఉన్న కోడెల శివరాం ఎన్నికల సమయానికి పార్టీ వీడిన ఆశ్చర్యం లేదనేది కొందరు చెబుతున్నా మాట.అదే గనుక జరిగితే సత్తెనపల్లిలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube