ప్రస్తుతం చాలామంది క్రెడిట్ కార్డులు( Credit cards ) వాడుతున్నారు.మనకు డబ్బులు అత్యవసరం అయినప్పుడు క్రెడిట్ కార్డులు బాగా ఉపయోగపడతాయి.
అంతేకాకుండా క్రెడిట్ కార్డులపై అనేక ఆఫర్లు ఉంటాయి.రెస్టారెంట్, పెట్రోల్, డీజిల్, షాషింగ్స్, ఎయిర్ పోర్ట్ లాంజ్, సినిమా టికెట్లపై ఆఫర్లు ఇస్తూ ఉంటారు.
అలాగే క్రెడిట్ కార్డు ద్వారా సులువుగా ఎలాంటి అదనపు ఛార్జీలు ( Additional charges )లేకుండా రెంట్ పేమెంట్ చేసుకోవచ్చు.ఈ ఆఫర్ల వల్ల డబ్బులు చాలా ఆదా అవుతాయి.
అందుకే క్రెడిట్ కార్డులను అందరూ వాడుతూ ఉంటారు.
అయితే క్రెడిట్ కార్డు వినియోగదారులకు ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ క్రెడ్( FinTech Company Cred ) శుభవార్త తెలిపింది.రూపే క్రెడిట్ కార్డు( RuPay Credit Card ) కలిగి ఉన్నవారికి గుడ్ న్యూస్ అందింది.తాజాగా క్రెడ్ యాప్లో రూపే క్రెడిట్ కార్డు యూపీఐ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిపి ఈ కొత్త సర్వీసులను క్రెడ్ ప్రారంభించింది.ఏ బ్యాంక్ కు చెందిన రూపే క్రెడిట్ కార్డు ద్వారా అయిన సరే ఈ యూపీఐ సేవలను పొందవచ్చని క్రెడ్ యజమాన్యం తెలిపింది.
యూనియన్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, బీఓబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్, కెనరా, ఇండియన్, కోటక్, పంజాబ్, యూనియన్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డులు ఉన్నవారు ఈ సేవలను పొందవచ్చు.
ఈ కొత్త సేవల వల్ల క్రెడ్ సభ్యులు కూడా రూపే క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయవచ్చు.క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు.ఇందుకోసం రూపే క్రెడిట్ కార్డును యూపీఐతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
దీని వల్ల సులువుగా క్రెడిట్ కార్డు నుంచి పేమెంట్స్ చేసుకోవడంతో పాటు బ్యాంకులకు కూడా దీని వల్ల ప్రయోజనం కలుగుతుంది.అయితే దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం యూపీఐ రూపే క్రెడిట్ కార్డు సర్వీసులో చేరలేదు.
త్వరలో ఆ బ్యాంకు కూడా చేరే అవకాశముందని తెలుస్తోంది.దీని వల్ల ఎస్బీఐ రూప్ క్రెడిట్ కార్డు కలిగి ఉన్నవారికి కూడా లాభం జరగనుంది.