కొండా ఫ్యామిలీని.. కాంగ్రెస్ దూరం పెడుతోందా !

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నేతలుగా కొండా ఫ్యామిలీకి మంచి పేరు ఉంది.రాష్ట్రం విడిపోక ముందు వైఎస్ హయంలో కొండా సురేఖగాని ఆమె భర్త కొండా మురళిగాని కీ రోల్ పోషిస్తూ వచ్చారు.

 Is The Congress Distancing The Konda Family, Konda Surekha, Congress, Revanth Re-TeluguStop.com

రాష్ట్రం విడిపోయిన తరువాత ఆయా పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ కు ప్రజాధరణ తగ్గడంతో కొండా దంపతులు బి‌ఆర్‌ఎస్ లో చేరారు.ఇక బి‌ఆర్‌ఎస్( BRS party ) లో కొంత కాలం ఉన్న తరువాత తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు కొండా దంపతులు.

అయితే సొంత గూటికి చేరినప్పటికి గతంలో ఉన్నంతా యాక్టివ్ గా వీరు ఉండడం లేదంటే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.

Telugu Congress, Konda Murali, Konda Surekha, Revanth Reddy, Telangana, Ts Congr

పైగా ఉమ్మడి వరంగల్( Warangal ) లో వీరికి ప్రజాధరణ కూడా తగ్గిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.దీంతో హస్తం పార్టీ కొండా దంపతులను లైట్ తీసుకుంటున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.జిల్లాల్లో వీరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పార్టీకీ సంబందించిన నిర్ణయాలు, కార్యక్రమాలు చేపతుడుతున్నట్లు టాక్.

దాంతో కాంగ్రెస్ లో వీరికి ప్రదాన్యం తగ్గిందనే భావనతో కొండా దంపతులు కూడా పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారట.వీరు త్వరలోనే బీజేపీలో చేరతారనే టాక్ నడుస్తోంది.

అయితే కొండా ఫ్యామిలీని కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే దూరం పెట్టినట్లు కొందరి అభిప్రాయం.

Telugu Congress, Konda Murali, Konda Surekha, Revanth Reddy, Telangana, Ts Congr

కొండా దంపతులు ఎప్పటికప్పుడు పార్టీలు మారతారనే టాక్ ఉంది.ఈ కారణంగానే వారి పట్ల కాంగ్రెస్ పెద్దగా ఫోకస్ చేయడంలేదట.అయితే ఒకవేళ కొండా దంపతులు కాంగ్రెస్ విడితే ఎంతో కొంత పార్టీని నష్టం జరిగే అవకాశం ఉంది.

ఎందుకంటే వరంగల్ లో కాంగ్రెస్ కు కొంత బలమైన ప్రజాధరణ ఉంది.అందువల్ల కొండా దంపతులు పార్టీని విడితే హస్తం పార్టీ ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉంది.

అలాగని పూర్తిగా వారిపైనే ఆధార పడే పరిస్థితి కూడా లేదు.అందుకే కొండా దంపతుల విషయంలో కాంగ్రెస్ ఎటు తేల్చుకోలేక పోతున్నట్లు ఇన్ సైడ్ టాక్.మరి ఈ సారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్.కొండా దంపతుల విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube