టాలీవుడ్ కింగ్ నాగార్జున ది ఘోస్ట్ సినిమా( The Ghost Movie ) ఫెయిల్యూర్ తర్వాత కొత్త ప్రాజెక్ట్ కు చాలా కాలం గ్యాప్ తీసుకున్నాడు.ఇప్పటి వరకు నాగార్జున సినిమా షూటింగ్ పూర్తి అయి ఆ సినిమా కూడా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా అసలు పట్టించుకోక పోవడంతో ఇంకా కొత్త సినిమా ప్రారంభం కాలేదు.
నాగార్జున ది ఘోస్ట్ తర్వాత ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వం లో సినిమా కు కమిట్ అయ్యాడు.క్లాప్ కూడా పడింది అంటూ వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పటి వరకు ఆ సినిమా కు సంబంధించిన ఎలాంటి అప్డేడ్ లేదు.
దానికి తోడు తాజాగా నాగార్జున కొత్త సినిమా కు సంబంధించిన ప్రకటన వచ్చింది. ధనుష్( Dhanush ) హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా లో నాగార్జున ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు.ఇప్పటికే నాగార్జున కెరీర్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆయన ఏ సినిమా చేసినా కూడా ఫెయిల్ అవుతుంది.అందుకే చాలా మంది సీనియర్ హీరోల మాదిరిగానే నాగార్జున కూడా హీరో పాత్రలను మానేసి సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాలి.
క్యారెక్టర్ ఆర్టిస్టు సినిమా చేయాలంటూ కొందరు కోరుకున్నారు./br>
అనుకున్నట్లుగానే నాగార్జున శేఖర్ కమ్ముల సినిమా( Sekhar Kammula ) లో కనిపించబోతున్న నేపథ్యం లో కొందరు ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినట్లేనా అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.నాగార్జున హీరోగా సినిమా లు చేయాలని ఇంకా కొందరు అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.ఒక వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమా లు చేస్తూ మరో వైపు హీరో గా కూడ ఆ నాగార్జున సినిమా లు చేస్తే బాగుంటుంది అనేది కొందరి అభిప్రాయం.
మొత్తానికి నాగార్జున ఇండస్ట్రీ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్నారు.ఆయన ఏం చేసినా కూడా కచ్చితంగా అటెన్షన్ ను దక్కించుకుంటారు.ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ సీజన్ 7 ను చేసేందుకు గాను రెడీ అవుతున్న విషయం తెల్సిందే.