మామూలుగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరో హీరోయిన్ లు నటీనటులు తెరవెనుక ఎన్నో కష్టాలను అనుభవిస్తుంటారు.కానీ ఒక్కసారిగా కెమెరా ముందుకు రాగానే ఆ కష్టాలన్నీ మరిచిపోయి వారి పాత్రలో మునిగిపోయి నటిస్తూ ఉంటారు.
ముఖ్యంగా సినిమాలలో చాలావరకు విలన్ పాత్రలను ప్రేక్షకులు ద్వేషిస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు సినిమాలలో సీరియల్ లో విలన్( Villain ) గా నటించేవారు నిజజీవితంలో కూడా అలాగే ఉంటారని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు.
వారిని ద్వేషిస్తూ తిట్టుకుంటూ ఉంటారు.
అటువంటి విల్లన్ లకు కూడా నిజ జీవితంలో కష్టాలు ఉంటాయి అంటే చాలామంది నమ్మరు.ఆ కష్టాలు ఎలా ఉంటాయన్నది సీనియర్ బాలీవుడ్ యాక్టర్( Bollywood ) పాపులర్ విలన్ గోపాల్ బేడి అలియాస్ రంజీత్( Gopal Bedi alias Ranjeet ) తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
సినిమాలలో ఎక్కువ శాతం హీరోయిన్ల చీరలు లాగే సన్నివేశాలలోనే ఎక్కువగా నటించడంతో రంజిత్-ది రేపిస్ట్ అనే పేరుతో పిలుస్తూ ఆట పట్టించేవారట.అలా ఆయన బాలీవుడ్ లో దోస్త్ ఔర్ దుష్మన్,ఫరేబి, నాగిన్ అమర్ అక్బర్ ఆంటోని, రాకీ, సర్ఫరోష్, బంటీ ఔర్ బబ్లీ, హౌస్‌ఫుల్ 4 లాంటి సినిమాలలో నటించి మెప్పించారు.
కేవలం హిందీలో మాత్రమే కాకుండా మలయాళం, భోజ్‌పురి( Bhojpuri ) భాషల్లో కూడా పని చేశారు.హిందీలో పలు సీరియల్స్ లో కూడా నటించారు.అలా ఒకానొక ఒక సమయంలో రంజిత్ విలన్ పాత్రలపై స్పందిస్తూ.విలన్ పాత్రలు చేసి చేసి విసిగిపోయాను అని తెలిపారు.కాగా ఇటీవల ఒక ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ.నేను ముంబైలో ఉంటున్నప్పుడు ఒకసారి అమ్మ నన్ను కలవడానికి వచ్చింది.
తిరిగి వెళ్లిపోతున్నప్పుడు దగ్గరుండి ఆమెను డ్రాప్ చెయ్యడానికి కూడా కుదిరేది కాదు.ఎందుకంటే అంత బిజీగా ఉండేవాణ్ణి.
కొద్ది రోజల తర్వాత నీకు మాతో గడిపే సమయం కూడా ఉండదు కదా, అందుకే మేం ముంబై షిఫ్ట్ కాలేదు అని నాన్న అన్నారు అని చెప్పుకొచ్చారు రంజిత్.