కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నాయకుడు, ఎంపీ బండి సంజయ్ భేటీ అయ్యారు.ఈ మేరకు పార్లమెంట్ లోని హోంమంత్రి కార్యాలయంలో సమావేశం అయ్యారని తెలుస్తోంది.
బీజేపీ తెలంగాణ చీఫ్ గా బాధ్యతల నుంచి వైదొలిగిన తరువాత అమిత్ షాను బండి సంజయ్ కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఈ క్రమంలో వీరిద్దరి భేటీపై తెలంగాణ రాజకీయా వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.