టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అబద్దానికి నిలువెత్తు రూపం చంద్రబాబని విమర్శించారు.
చంద్రబాబు సీఎం కాకముందే సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ లో చేరారని తెలిపారు.
చంద్రబాబు నోరు తెరిస్తే అన్ని అబద్దాలేనని మంత్రి కాకాణి పేర్కొన్నారు.
చంద్రబాబు కుట్రపూరితంగానే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు.వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని తెలిపారు.
రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న మంచిని చంద్రబాబు చూడలేక విష ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.