తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈమె మొదట రాజేంద్ర ప్రసాద్, సీనియర్ హీరోయిన్ ఈశ్వరి రావులు జంటగా నటించిన రాంబంటు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపను ఏర్పరుచుకుంది ఐశ్వర్య రాజేష్.
తెలుగులోనే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తరువాత కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ తో పాటు రాజేంద్రప్రసాద్, శివ కార్తికేయ నటించిన విషయం తెలిసిందే.మొదటి సినిమాతోనే ఊహించని విధంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఐశర్య రాజేష్.ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్( World Famous Lover Movie ) సినిమాలో కూడా నటించింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఐశ్వర్య రాజేష్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేసింది.
ఇటీవల ఫర్హానా సినిమాతో( Farhana Movie ) అలరించిన ఐశ్వర్య రాజేశ్ తాజాగా తన మేనల్లుడు ఆర్యన్‌తో కలిసి షాపింగ్‌కు వెళ్లారు.ఖరీదైన ఆ షాపింగ్ మాల్‌లో అతడు చేసిన పనికి ఆమె భావోద్వేగానికి గురయ్యారట.
ఈ విషయాన్ని తెలుపుతూ ఈ విధంగా రాసుకొచ్చింది.నా మేనల్లుడు ఆర్యన్‌తో కలిసి షాపింగ్‌కు వెళ్లాను.అక్కడికి చేరుకున్న వెంటనే ఆర్యన్ బిల్లింగ్ కౌంటర్ వద్దకు వెళ్లి.మా అత్త ఏం తీసుకున్నా తనని డబ్బులు అడగకండి.ఆమె కొనుగోలు చేసిన వాటికి నేనే డబ్బులు చెల్లిస్తా అంటూ తన జేబులో ఉన్న డబ్బులు తీసి అక్కడి సిబ్బంది చేతిలో పెట్టాడు.అనంతరం నా వద్దకు వచ్చి.
అత్తా.నీకు నచ్చింది తీసుకో బిల్లు నేను కడతా అని చెప్పాడు.
వాడి మాటలు వింటే నాకు కన్నీళ్లు వచ్చేశాయి.వాడు నాపై చూపించే ప్రేమను మరెవరూ బీట్ చేయలేరు అంటూ ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.