హైదరాబాద్ నగరంలోని పలు స్పా సెంటర్లపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ .10 లోని ఓ భవనంలో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు.ఈ క్రమంలో దాడులు నిర్వహించిన పోలీసులు మొత్తం 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
వీరిలో ముగ్గురు నిర్వాహకులతో పాటు పది మంది యువతులు ఉన్నారు.గత రెండేళ్లుగా ఆయుర్వేదిక్ స్పా సెంటర్ పేరుతో ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నట్లు నిర్ధారించారు.