ఏపీని నంబర్ వన్ చేస్తా.. ఆ స్కీమ్ ను మించిన స్కీమ్ తెస్తా.. పవన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి యాత్రలో భాగంగా వైసీపీపై( YCP ) చేస్తున్న ఘాటు విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ యాత్రలకు ప్రజల నుంచి అంచనాలను మించి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

 Pawan Kalyan Sensational Comments Goes Viral In Social Media Details Here Goes-TeluguStop.com

తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగ తెగ వైరల్ అవుతున్నాయి.ఏపీని నంబర్ వన్ చేసే బాధ్యతను జనసేన( Janasena ) తీసుకుంటుందని పవన్ చెప్పుకొచ్చారు.

ఏపీ భవిష్యత్తు కోసం గొడ్డు చాకిరీ చేస్తానని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.బలమైన నాయకుడు ఉంటే మాత్రమే రాష్ట్రం దశ, దిశ మారడం సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

సమగ్రమైన ప్రణాళికతో ఏపీ అభివృద్ధి కోసం ప్రణాళికను సిద్ధం చేసి ఆ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసే బాధ్యతను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ వెల్లడించడం గమనార్హం.

Telugu Janasena, Number, Pawan Kalyan-Politics

రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన సమయంలో నా గుండె కోసేసినట్లు అయిందని పవన్ చెప్పుకొచ్చారు.గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని పవన్ కామెంట్లు చేశారు.పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడం జగన్ నొక్కని బటన్ అని పవన్ చెప్పుకొచ్చారు.

జనసేన అధికారంలోకి వస్తే ఆరోగ్య శ్రీ స్కీమ్( Arogya Shri Scheme ) ను మించిన స్కీమ్ ను అమలు చేస్తానని పవన్ తెలిపారు.

Telugu Janasena, Number, Pawan Kalyan-Politics

అప్పుల ఆంధ్రప్రదేశ్ జగన్ నొక్కని బటన్ అంటూ పవన్ ఘాటు విమర్శలు చేశారు.పవన్ కళ్యాణ్ చేసిన ఈ విమర్శలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు.

పవన్ రాజకీయాల్లో సైతం సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.పవన్ కళ్యాణ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube