ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హీట్ మొదలైంది.ఎన్నికలకు పది నెలల సమయం ఉండగానే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ జరుగుతోంది.
అభివృద్ధి విషయంలో వైసీపీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావచ్చని ప్రచారం జరుగుతోంది.టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే మాత్రం అంచనాలకు అందని ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే ప్రముఖ నటుడు శివాజీ ( Shivaji )ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఒక ఇంటర్వ్యూలో నేను అన్న ఒక మాట వల్ల జూనియర్ ఎన్టీఆర్ గురించి నెగిటివ్ గా వెళ్లిందని శివాజీ తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా అన్నా.బాగున్నావా అని పలకరిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
నేను తారక్ కు దూరంగా ఉన్నానని శివాజీ కామెంట్లు చేశారు.నన్ను హర్ట్ చేసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) కాదని ఆయన అన్నారు.

నేను ఏ ఆర్టిస్ట్ కు కూడా ఎదురెళ్లలేదని శివాజీ కామెంట్లు చేశారు.తారక్ రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకుంటానని ఆయన అన్నారు.సాక్షి పత్రిక అల్లిన కథనాలను నమ్మొద్దని శివాజీ తెలిపారు.ఎన్టీఆర్, పవన్ లకు డబ్బుతో పని లేదని ఆయన కామెంట్లు చేశారు.వీళ్లిద్దరికీ ఛరిష్మా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.టీడీపీతో ఎన్టీఆర్ కు గ్యాప్ క్రియేషన్ మాత్రమే అని శివాజీ చెప్పుకొచ్చారు.
ఏ ఇంట్లో మనస్పర్ధలు లేవని ఆయన ప్రశ్నించారు.జగన్( YS Jagan Mohan Reddy ) కు ఆయన చెల్లికి మధ్య మనస్పర్ధలు లేవా అంటూ శివాజీ పరోక్షంగా కామెంట్లు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారని ఒక్కో సినిమాకు 80 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని అందువల్లే ఆయన రాజకీయాల గురించి ఆసక్తి చూపకుండా ఉండి ఉండవచ్చని శివాజీ పేర్కొన్నారు.శివాజీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రాబోయే రోజుల్లో ఎన్టీఆర్, పవన్ లకు వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కలిసి పని చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.గోదావరి జిల్లాలలో 2024 ఎన్నికల్లో జనసేన సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







