ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టఫ్ ఫైట్ నడిచేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.టిడిపి , జనసేన,బిజెపిలు పొత్తుల ద్వారా అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుండగా, వైసిపి ( YCP ) మాత్రం ఒంటరిగానే వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటామని ధీమా ను వ్యక్తం చేస్తోంది.
తాము ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటామని, తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని వైసిపి నమ్మకంతో ఉంది.ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్( CM Jagan ) పదేపదే ప్రస్తావిస్తున్నారు.2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని, మరికొన్ని సంక్షేమ పథకాలతో ప్రజల దగ్గరకు వైసిపి వెళ్తుందని, అలాగే ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తుండడం వంటివన్నీ తనకు కలిసి వస్తాయని ని ఆశలు పెట్టుకుంది .అలాగే గడపగడపకు మన ప్రభుత్వం కు వస్తున్న స్పందనతో మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే ధీమాతో వైసిపి ఉంది.

టిడిపి, జనసేన పార్టీలు వైసీపీపై టార్గెట్ పెట్టుకోవడం, పవన్ ,( Pawan Kalyan ) చంద్రబాబు ( Chandrababu Naidu ) ఇద్దరు చెరో రెండేసి నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న వార్తల పైన వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు.ఒకే కుటుంబం , జనమంతా ఒకే నిలయం అని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి చెబుతున్నారు. వైసిపిని ఎలా ఓడించాలో తెలియక ప్రతిపక్ష పార్టీలని తలలు పట్టుకుంటున్నాయని, ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదని విమర్శించారు.తమ ప్రభుత్వ పాలనలో ఏవైనా లోపాలు, అవకుతవకులు జరిగినట్లు ఆధారాలు ఉంటే ప్రతిపక్ష నేతలు వెలికి తీయవచ్చు అని విజయసాయిరెడ్డి చెబుతున్నారు.

ప్రజలే తమ అసలు బలమని, తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని, అన్ని పార్టీలు మూకుమ్మడిగా తమపై పోటీకి వచ్చినా, తాము తప్పకుండా గెలుస్తామని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే ఏపీలో రాజకీయ పరిస్థితులు, అన్ని పార్టీల బలాబలాలు, నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు , ఏ పార్టీకి ఏ నియోజకవర్గంలో పట్టు ఉంది ? ఏ పార్టీ ఏ నియోజకవర్గంలో గెలవబోతోంది అనే అనేక అంశాలపై జగన్ సర్వేలు చేయించారు.అలాగే వైసిపి ప్రభుత్వంపై ఏ అంశాల్లో జనాల్లో వ్యతిరేకత ఉంది ? వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనే అంశాల పైన జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు .మొత్తంగా 2024 ఎన్నికల్లో వైసిపి జెండా రెపరెపలాడుతుందని, ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అనే ధీమాతో జగన్ ఉన్నారు.







