సడెన్ గా సౌత్ స్టార్ హీరోయిన్ అది కూడా సీనియర్ హీరోయిన్ కి టాలీవుడ్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది.తనకు తెలుగు సినిమాలే క్రేజ్ తెచ్చాయని.
తెలుగులో నటించడం వల్లే తను స్టార్ స్టేటస్ దక్కించుకున్నానని అంటుంది.రెండు దశాబ్ధాలుగా కెరీర్ కొనసాగిస్తున్న ఆ సీనియర్ హీరోయిన్ ఈమధ్య టాలీవుడ్ ( Tollywood )నుంచి ఎలాంటి ఆఫర్ వచ్చినా చేయనని చెబుతూ వచ్చిందట.
ఏమైందో ఏమో కానీ ఇప్పుడు అమ్మడి ఫోకస్ అంతా తెలుగు సినిమాల మీద మళ్లిందట.ఇక్కడ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అని అంటుంది.
ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే ఇంకెవరు చెన్నై చిన్నది త్రిష( Trisha )అని తెలుస్తుంది.స్టార్ హీరోయిన్ గా త్రిష ఫాం గురించి అందరికీ తెలిసిందే.అయితే 20 ఏళ్లు కావొస్తున్నా త్రిష ఇప్పటికీ అదే క్రేజ్ కొనసాగిస్తుంది.అయితే త్రిష ఈమధ్య తెలుగు ఆఫర్లని కాదన్నదని టాక్ వచ్చింది.కానీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాల గురించి ఇక్కడ తనని ప్రేక్షకులు తనని ఆదరించిన విషయం గురించి మాట్లాడింది.ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని చర్చ నడుస్తుంది.
త్రిష తెలుగులో వరుస సినిమాలు చేస్తే ఇక్కడ ఫ్యాన్స్ ఖుషి అవుతారు.