ప్రభాస్ ప్రాజెక్ట్ K ( Project K )లో కమల్ హాసన్ విలన్ గా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.అయితే ప్రభాస్ సినిమాలో కమల్ అనగానే సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి.
అంతేకాదు ప్రభాస్( Prabhas ) సినిమాకు కమల్ కచ్చితంగా ప్లస్ అవుతారని అందరు అంటున్నారు.లోకనాయకుడు కమల్ హాసన్ ఒక క్యారెక్టర్ కి ఓకే చెప్పారు అంటే అందులో కచ్చితంగా సంథింగ్ స్పెషల్ ఉంటుంది.
అయితే ఈ పాత్రని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎలా తీర్చిదిద్దుతారు అన్నది కూడా చర్చ నడుస్తుంది.
కమల్ ని సినిమాలో తీసుకోవడం వల్ల ఎంత ప్లస్ ఉందో అంతే మైనస్ ఉంది.ఎందుకంటే కమల్ పాత్ర ఏమాత్రం తేడా కొట్టినా ఫ్యాన్స్ అసలు ఊరుకోరు.అంతేకాదు తెలుగులో కూడా కమల్ హాసన్ ( Kamal Haasan )కి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది.
కాబట్టి కమల్ హాసన్ ని సరిగా వాడకపోయినా ప్రభాస్ ముందు కమల్ ని ఒక పాత్రలా డీల్ చేసినా ప్రాజెక్ట్ Kకి అది పెద్ద దెబ్బ వేస్తుందని చెప్పొచ్చు.ఈ విషయంలో నాగ్ అశ్విన్ ప్లాన్ ఏంటో కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబోపై సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
కమల్ మాత్రమే కాదు ప్రాజెక్ట్ K లో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు.దీపిక పదుకొనె ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.