యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్'( Adipurush ) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రం పై అభిమానుల్లో మాములు అంచనాలు ఉండేవి కాదు, విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ విషయం లో ఈ చిత్రం అద్భుతాలు సృష్టించింది.
ఆ రేంజ్ బుకింగ్స్ బాలీవుడ్ ఖాన్స్ కి కూడా సాధ్యం కాలేదని స్వయంగా బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్పారు.ఆ అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా మొదటి మూడు రోజులు టాక్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ఓపెనింగ్ ని దక్కించుకుంది .కేవలం మూడు రోజుల్లోనే 300 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ ని కొల్లగొట్టింది.ఆ తర్వాత నాల్గవ రోజు నుండి మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి.
బయ్యర్స్ కి మరియు నిర్మాతలకు కనీసం వంద కోట్ల రూపాయిలు నష్టాన్ని కలిగించేలా ఉంది.
ఇంత పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఈ సినిమాకి సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ ఓం రౌత్.ఇప్పటి వరకు శ్రీ రాముడి అరణ్య వాసం, ఆ తర్వాత రాముడు ఆమెని అపహరించడం,శ్రీ రాముడు లంక కి వెళ్లి రావణుడిని హరించడం వరకు చూపించారు.ఇక పార్ట్ 2 లో అయోధ్య కి పట్టాభిషేకం చేసిన తర్వాత రాముడు సీతని అడవుల పాలు చెయ్యడం, ఆ తర్వాత సీత దేవి పడిన కష్టాలను మొత్తం పార్ట్ 2 లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడట డైరెక్టర్ ఓం రౌత్( Director Om Raut ).
అయితే రీసెంట్ గానే ఆయన ప్రభాస్ ని కలిసి ఈ ఐడియా ప్రస్తావించగా, ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ చాలు, నన్ను వదిలేయ్, ఈ కథకి నేను కరెక్ట్ కాదు అని డైరెక్టర్ ఓం రౌత్ తో అన్నాడట ప్రభాస్.
కానీ ఈసారి రామాయణం తన స్టైల్ లో కాకుండా, వాల్మీకి( Valmiki Ramayanam ) ఎలా అయితే రాశాడో, దానినే ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తానని.బడ్జెట్ ని కూడా బాగా లిమిట్ లో పెడతాను ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి అంటూ ప్రభాస్( Prabhas ) ని చాలా రిక్వెస్ట్ చేసాడట డైరెక్టర్ ఓం రౌత్.అప్పుడు ప్రభాస్ ఒకసారి ఆలోచించుకొని చెప్తా అని చెప్పాడట.
ఒకవేళ ప్రభాస్ ఓకే చెప్పి ఈ సినిమాని ప్రారంభిస్తే కచ్చితంగా ఈ చిత్రానికి ‘ఆదిపురుష్’ వచ్చినంత క్రేజ్ అయితే రాదు అనే చెప్పాలి.ఇలాంటి రిస్క్ ప్రభాస్ చేస్తాడో లేదో చూడాలి.
ఒక వేళా చేస్తే పెద్ద సాహసం అనే చెప్పాలి.