ఇండియన్ మార్కెట్ మీద కన్నేసిన ఆపిల్,( Apple ) 2 నెలల క్రితం దిల్లీ, ముంబయిలో ఐఫోన్ రిటైల్ స్టోర్లను ఓపెన్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే.ఈ క్రమంలోనే ఇక్కడ సొంత క్రెడిట్ కార్డులను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ఇదేగాని ఇక్కడ సూపర్ సక్సెస్ అయిందంటే ఆపిల్ కస్టమర్లు ఐఫోన్ పట్టుకుని తిరిగినట్లు, ఇకనుండి ఆపిల్ క్రెడిట్ కార్డులను( Apple Credit Card ) జేబులో పెట్టుకునే రోజులు తిరగాల్సి ఉంటుంది.ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్,( Tim Cook ) ఆపిల్ రిటైల్ స్టోర్ల ఓపెనింగ్ కోసం ఏప్రిల్లో ఇండియాకు వచ్చినప్పుడు, HDFC బ్యాంక్ CEO MD శశిధర్ జగదీష్ ని కలిసిన విషయం కూడా తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇండియన్ క్రెడిట్ కార్డ్ మార్కెట్ గురించి ఆరా తీసినట్లు మనీ కంట్రోల్ రిపోర్ట్ చేసింది.

మన దేశంలో ‘ఆపిల్ పే’( Apple Pay ) ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఆపిల్ చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఆపిల్ రూపే క్రెడిట్ కార్డుని UPIకి లింక్ చేసే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు.HDFC బ్యాంకుతో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుని లాంచ్ చేసేందుకు ఆ మధ్య మీటింగ్ కూడా జరిగింది.
అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోనూ ఆపిల్ చర్చలు జరిపింది.దాంతో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ తీసుకురావాలంటే ఇండియన్ రూల్స్ పాటించాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆపిల్ తో తెగేసి చెప్పింది.

ఆపిల్ అనేది ఇపుడు గ్లోబల్ బ్రాండ్.తన బ్రాండ్ ఇమేజ్ ఇంచు కూడా తగ్గకుండా సర్వీస్ ఇస్తుంది.ప్రస్తుతం, అమెరికాలో ప్రీమియం క్రెడిట్ కార్డ్ సర్వీసులను అందివ్వగా ఆ సేవలను విశ్వవ్యాప్తం చేయాలని తపిస్తోంది.అయితే ఇక్కడ అందరూ ఆయా కార్డులను వాడే వీలుండదు.ఇండియాలోనూ ఖరీదైన కస్టమర్లనే టార్గెట్ చేసే దిశగా ఆపిల్ అడుగులు వేస్తోంది.కాగా గత రెండేళ్లుగా ఆపిల్ భరత్ పైనే ఫోకస్ పెట్టింది.2022-23లో, ఇండియాలోని ఐఫోన్ మేకర్ల అమ్మకాలు ₹50,000 కోట్ల మార్కుని చేరాయనే విషయం విదితమే.మన దేశంలోని మొత్తం స్మార్ట్ఫోన్ మార్కెట్లో 4 శాతం వాటా ఆపిల్ ఆక్రమించింది.
రెండు కోట్ల మంది ఐపోన్ కస్టమర్లు ఈ కంపెనీ సొంతం.ఈ క్రమంలోనే రకరకాలైన ఐడియాలతో ఇక్కడ పాగా వేయాలని చూస్తోంది.