ఇండియాలోకి చొచ్చుకు వచ్చిన ‘ఆపిల్ క్రెడిట్ కార్డ్’… అన్ని ఫ్రీ అట!
TeluguStop.com
ఇండియన్ మార్కెట్ మీద కన్నేసిన ఆపిల్,( Apple ) 2 నెలల క్రితం దిల్లీ, ముంబయిలో ఐఫోన్ రిటైల్ స్టోర్లను ఓపెన్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే.
ఈ క్రమంలోనే ఇక్కడ సొంత క్రెడిట్ కార్డులను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ఇదేగాని ఇక్కడ సూపర్ సక్సెస్ అయిందంటే ఆపిల్ కస్టమర్లు ఐఫోన్ పట్టుకుని తిరిగినట్లు, ఇకనుండి ఆపిల్ క్రెడిట్ కార్డులను( Apple Credit Card ) జేబులో పెట్టుకునే రోజులు తిరగాల్సి ఉంటుంది.
ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్,( Tim Cook ) ఆపిల్ రిటైల్ స్టోర్ల ఓపెనింగ్ కోసం ఏప్రిల్లో ఇండియాకు వచ్చినప్పుడు, HDFC బ్యాంక్ CEO MD శశిధర్ జగదీష్ ని కలిసిన విషయం కూడా తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇండియన్ క్రెడిట్ కార్డ్ మార్కెట్ గురించి ఆరా తీసినట్లు మనీ కంట్రోల్ రిపోర్ట్ చేసింది.
"""/" /
మన దేశంలో ‘ఆపిల్ పే’( Apple Pay ) ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఆపిల్ చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆపిల్ రూపే క్రెడిట్ కార్డుని UPIకి లింక్ చేసే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు.
HDFC బ్యాంకుతో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుని లాంచ్ చేసేందుకు ఆ మధ్య మీటింగ్ కూడా జరిగింది.
అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోనూ ఆపిల్ చర్చలు జరిపింది.దాంతో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ తీసుకురావాలంటే ఇండియన్ రూల్స్ పాటించాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆపిల్ తో తెగేసి చెప్పింది.
"""/" /
ఆపిల్ అనేది ఇపుడు గ్లోబల్ బ్రాండ్.తన బ్రాండ్ ఇమేజ్ ఇంచు కూడా తగ్గకుండా సర్వీస్ ఇస్తుంది.
ప్రస్తుతం, అమెరికాలో ప్రీమియం క్రెడిట్ కార్డ్ సర్వీసులను అందివ్వగా ఆ సేవలను విశ్వవ్యాప్తం చేయాలని తపిస్తోంది.
అయితే ఇక్కడ అందరూ ఆయా కార్డులను వాడే వీలుండదు.ఇండియాలోనూ ఖరీదైన కస్టమర్లనే టార్గెట్ చేసే దిశగా ఆపిల్ అడుగులు వేస్తోంది.
కాగా గత రెండేళ్లుగా ఆపిల్ భరత్ పైనే ఫోకస్ పెట్టింది.2022-23లో, ఇండియాలోని ఐఫోన్ మేకర్ల అమ్మకాలు ₹50,000 కోట్ల మార్కుని చేరాయనే విషయం విదితమే.
మన దేశంలోని మొత్తం స్మార్ట్ఫోన్ మార్కెట్లో 4 శాతం వాటా ఆపిల్ ఆక్రమించింది.
రెండు కోట్ల మంది ఐపోన్ కస్టమర్లు ఈ కంపెనీ సొంతం.ఈ క్రమంలోనే రకరకాలైన ఐడియాలతో ఇక్కడ పాగా వేయాలని చూస్తోంది.