వర్షాకాలంలో ఆరోగ్యం జాగ్రత్త..! ఆ సమయంలో లో రోగనిరోధక శక్తి తప్పనిసరి..!

ఇప్పుడిప్పుడే వర్షాకాలం( rainy season ) సంకేతంగా తొలకరి జల్లులు చల్లని అనుభూతిని కలిగిస్తున్నాయి.ఇక చిటపట చినుకులు కురుస్తూ ఉన్నాయి.

 Take Care Of Your Health In Rainy Season Immunity Is Mandatory At That Time , Ra-TeluguStop.com

ఈ విధంగా వర్షాకాలం వస్తుందని అర్థం.వర్షాకాలం ఆనందాలతో పాటు కొన్ని సీజనల్ వ్యాధులను కూడా తీసుకొస్తుంది.

ఈ సమయంలో ఎవరైనా చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతారు.అయితే దోమల( Mosquitoes ) ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వైరల్ వ్యాధులు, ఆహారం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు ఈ సీజన్లో ఉంటాయి.

అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.అందుకే ఇలాంటి సమయంలో బయట చేసే ఆహారాలను, స్ట్రీట్ ఫుడ్ లను నివారించడం మంచిది.

Telugu Jamun, Apple, Tips, Immunity, Lychee, Pear, Pomegranate, Rainy Season-Tel

ఇక అతిసారా, కలరా వ్యాధులను( Diarrhea , cholera ) నివారించడానికి ఆ సమయంలో కాచిన నీటిని తీసుకోవడం, సరిగ్గా ఉడికించిన లేదా మూతపెట్టనీ ఆహారాన్ని నివారించడం చాలా అవసరం.అంతే కాకుండా తరచూ చేతి పరిశుభ్రతను పాటించాలి.ఈ సీజన్లో ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రమైన సమతుల్య ఆహారం తీసుకోవాలి.అంతేకాకుండా తగినంత నిద్ర, వ్యాయామం చేయడం చాలా అవసరం.అయితే మరీ ముఖ్యంగా వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ప్రయత్నించాలి.అయితే వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Jamun, Apple, Tips, Immunity, Lychee, Pear, Pomegranate, Rainy Season-Tel

ఆపిల్, జామున్, లిచీ, చెర్రీస్, బేరి, దానిమ్మ లాంటి పండ్లను తీసుకోవడం మంచిది.వర్షాకాలంలో పుచ్చకాయ, సీతాఫలాన్ని నివారించడం మంచిది.అంతే కాకుండా ఆహారంలో వెల్లుల్లిని కూడా చేర్చుకోవాలి.ఇక పాలకు బదులు పెరుగు ఇతర ప్రోబయోటిక్స్ తీసుకోవాలి.ఇవి చెడు బ్యాక్టీరియాను ప్రవేశించే అవకాశాన్ని తగ్గిస్తాయి.ఇక అంటువ్యాధులను నివారించడానికి మెంతులు, కాకరకాయ, వేపా, పసుపు లాంటి మూలికలు, సుగంధ ద్రవ్యాలు సహాయపడతాయి.

వర్షాకాలంలో పచ్చివి తినడం, సలాడ్ లు తినడం మానుకోవాలి.ఇక వర్షాకాలంలో మాంసానికి దూరం ఉంటే చాలా మంచిది.

దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు లాంటి ఔషధ గుణాలు కలిగిన మసాల దినుసులతో తయారుచేసిన డికాషన్ తాగడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube