ప్రముఖ నటి రోజా( Roja ) ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.ఉపాసన తాజాగా పండంటి పాపకు జన్మనివ్వగా రోజా సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్లు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
ట్విట్టర్ ద్వారా రోజా చరణ్ ఉపాసనలకు అభినందనలు తెలియజేయడంతో పాటు తాతయ్య అయిన చిరంజీవికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎప్పుడూ శక్తివంతంగా, యవ్వనంగా ఉండే కొణిదెల కుటుంబానికి భగవంతుడు మెగా ప్రిన్సెస్ రూపంలో ఆశీర్వాదాలను అందించాడని రోజా చెప్పుకొచ్చారు.
రామ్ చరణ్ ను నా చేతులలో హత్తుకున్న రోజులు నాకింకా గుర్తున్నాయని రోజా కామెంట్లు చేశారు.చరణ్ కు పాప పుట్టిందని తెలిసిన వెంటనే నాకు సంతోషం కలిగిందని రోజా పేర్కొన్నారు.
చిరంజీవి( Chiranjeevi ) సార్ మీరు తాతయ్య అయినా నాకు మాత్రం ఎప్పటికీ హీరోనే అని రోజా చెప్పుకొచ్చారు.
ఉపాసన( Upasana ) మీ ఇంటి చిన్ని మహాలక్ష్మికి ఇవే నా ఆశీస్సులు అంటూ రోజా చెప్పుకొచ్చారు.రోజా చేసిన ఈ కామెంట్లు అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.రోజా ఎంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయతతో మెగా ఫ్యామిలీ గురించి పాజిటివ్ గా చేసిన కామెంట్లు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.
రోజా మంచి మనస్సుకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.
కొన్నిరోజుల క్రితం పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతుండగా రోజా సీఎం జగన్( CM Jagan ) ద్వారా తన వంతు సహాయం చేయడం గమనార్హం.రోజాపై ప్రేక్షకుల్లో కొంత నెగిటివిటీ ఉన్నా ఆ మాత్రం అభిమానుల మనస్సు గెలుచుకోవడానికి తన వంతు కష్టపడుతున్నారు.రోజా 2024 ఎన్నికల వరకు సినిమాలకు దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో సైతం మళ్లీ గెలిచి మంచి ఫలితాలను అందుకోవాలని మంత్రి రోజా కోరుకుంటున్నారు.