ఓం కం టు మై రూమ్.కొన్ని విషయాలు తేల్చుకుందాం.
రామాయణం అనే పేరు చెప్పి ఆదిపురుష్ ( Adipurush ) టైటిల్ పెట్టుకొని దర్శకుడు ఓం చారిత్రక తప్పిదాలు చేస్తూ వచ్చాడు ఈ సినిమాలో.లెక్కకు మించిన ఆ తప్పులు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.
రామాయణంపై ఇప్పటివరకు పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి.ఎవరికీ సాధ్యం కానీ ఒక అతి పెద్ద తప్పిదం ఓం కి సాధ్యమైంది.
అది ఏంటంటే రాముడు( Lord rama ) చూస్తుండగానే రావణాసురుడు వచ్చి సీతను అపహరించడం.దీన్ని మించిన తప్పిన మరొకటి ఉండకపోవచ్చు.
కుంభకర్ణుడి చేత ఆంజనేయుడిని కొట్టించడం ఏదైతే ఉందో అది కూడా చరిత్రను వక్రీకరించడమే.అలా ఆంజనేయుడుని కుంభకర్ణుడు కొడుతున్న సమయంలో అంతటి మహావీరుడికి తెలియకుండా రాముడు బాణం విసిరి చంపడం కూడా ఒక తప్పుగానే చెప్పుకోవచ్చు.ఇక పరమ పతివ్రత అయిన మండోదరిని భర్త చనిపోయిన విధవగా చూపించడం కూడా ఎక్కడా చరిత్రలో లేదురాముని పాత్రను పరిచయం చేస్తూనే వేలమంది రాక్షసులను చంపుతున్నట్టుగా చూపించాడు వారెవరు ఏ కారణం చేత చంపబడుతున్నారనే విషయాన్ని ప్రేక్షకులకు రివీల్ చేయలేదు పోనీ దర్శకుడు కైనా తెలుసా అనేది డౌట్.
వాల్మీకి రాసినటువంటి రామాయణంలో సీత అని అరుస్తున్న రాముని కోసం వెళ్లవలసిందిగా లక్ష్మణుడి సూచిస్తుంది అలాగే నిందిస్తుంది కూడా అది నిజమే కానీ లక్ష్మణ రేఖ అనేది అబద్ధం కానీ ఇక్కడ ఒకటి తీసుకున్నాడు మరొకటి తీసుకోలేదు.అశోక వనంలో కూర్చున్న సీతమ్మ ఎప్పుడు రావణాసురుడు వచ్చినా గడ్డిపోచని చూస్తూనే మాట్లాడింది కానీ కన్నెత్తి చూసినట్టుగా ఎక్కడా లేదు కానీ ఇక్కడ ఈ తప్పు జరిగిపోయింది.కుబేరుడు నుంచి బలవంతంగా లాక్కున్న స్వర్ణ లంకను బూతు బంగ్లా గా చూపించడం మరొక చరిత్ర వక్రీకరణ.
ఇక ఫైనల్ గా శివ భక్తు( Lord shiva )ల మొఖాన శివ నామాలు లేవు, ఆడవారి ముఖం పై బొట్లు లేవు, అంతకు మించి పుష్పక విమానం సైతం లేదు.ఓం ప్లీజ్ కం టు మై రూమ్.