పెద్ద బడి వద్దకు చేరుకున్న మంటలు బడిలో నుండి బయటకు వచ్చిన విద్యార్థులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రమాద వశాత్తుగా చెలరేగిన మంటలు సుమారుగా నాలుగు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్న పెద్ద బడి వద్దకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఇట్టి మంటలు పెద్ద బడి వద్దకు చేరుకుంటున్న విషయం పసిగట్టిన ఒగ్గు మహేష్ చంద్ర యాదవ్ పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయగా పెద్ద బడి రెండవ అంతస్తులో ఉన్న పదవ తరగతి విద్యార్థులు మంటల వేడికి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

 The Fire Reached The School And The Students Came Out Of The School. , Rajitha Y-TeluguStop.com

వెంటనే పాఠశాల ఉపాధ్యాయుడు గరుగుల కృష్ణ హరి ( Krishna Hari )పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను బయటకు పంపించడంతో విద్యార్థులు వారి తల్లదండ్రులు ఊపిరపీల్చుకున్నారు కాగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దబ్బెడ హన్మాండ్లు పాఠశాలకు గైర్హాజరు అయ్యారని తెలిసింది.ఒకవేళ విద్యార్థులను అప్రమత్తం చేయకుంటే మంటలకు పెద్ద బడి రెండవ అంతస్తులో ఉన్న వారికి ఊపిరి ఆడకుండా ఇబ్బందులకు గురయ్యే వారని ఊహించని ప్రమాదం జరిగేదని పలువురు పేర్కొన్నారు.

ఎలాంటి సంశయం వ్యక్తం చేయకుండా పాఠశాల ఉపాధ్యాయుడు గరుగుల కృష్ణ హరి తీసుకున్న నిర్ణయం పై ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్( Rajitha Yadav ),ఎస్.ఎం.సి మాజీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ కృష్ణ హరి నీ అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube