మధ్యప్రదేశ్ ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్)( Anti-Terrorist Squad ) అధికారులు హైదరాబాద్ – భోపాల్‌లలో కొంతమంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి అందరికీ విదితమే.కాగా ఈ కేసుకు సంబంధించిన విచారణను ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ)( NIA ) ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
ఈ కేసును ఢిల్లీ యూనిట్ గత నెల 24న రీ-రిజిస్టర్ చేయగా దీని దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక ఎన్‌ఐఏ బృందం సోమవారం ఢిల్లీ నుంచి భోపాల్ చేరుకుంది.ఏటీఎస్ అధికారులతో సమావేశమైన ఈ టీమ్.
కేసు గురించి సమగ్ర విచారణ చేపట్టింది.
గత నెల 9వ తేదీన ఏటీఎస్ అధికారులు హైదరాబాద్‌లో ఐదుగురు, భోపాల్‌లో 11 మందిని అరెస్టు చేయగా యావత్ ఇండియాలోనే ఈ విషయం పెను సంచలనం అయింది.హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్‌యూటీ)( HUT ) ఉగ్ర సంస్థకు చెందిన ఈ మాడ్యుల్ షరియత్ స్థాపనే లక్ష్యంగా విధ్వంసాలకు పథక రచన చేసినట్టు తెలుస్తోంది.వీరి టార్గెట్‌లో అనేక ప్రాంతాలతో పాటు మత నాయకులు కూడా ఉన్నట్లు ఏటీఎస్ ఆరోపిస్తోంది.
కాగా, ఈ ఉగ్రవాదులు తెలంగాణ, మధ్యప్రదేశ్‌తో పాటు ఏయే రాష్ట్రాలను టార్గెట్‌గా చేసుకున్నారనే కోణంలో ఎన్‌ఐఏ ముమ్మురంగా దర్యాప్తు చేస్తోంది.
ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పేలుడు పదార్థాలనూ సమీకరిస్తున్న వీరి అసలు కుట్ర ఏమిటి అన్నదానిపై ప్రస్తుతం ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది.ఈ 16 మంది ఉగ్రవాదులను అధికారులు ఇప్పటికే 2 సార్లు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.ఎన్‌ఐఏ అధికారులు సైతం హైదరాబాద్, భోపాల్‌లకు చెందిన మహ్మద్ సలీం, యాసిర్ ఖాన్‌లతో పాటు మిగిలిన వారినీ మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.
కేసు దర్యాప్తులో భాగంగా త్వరలో వీరిని హైదరాబాద్ తీసుకురావాలని ఎన్‌ఐఏ నిర్ణయించింది.అయితే ఈ కేసు గురించిన విషయాలు ఇంకా తెలియాల్సి వుంది.త్వరలో మరిన్ని విషయాలు బయటపడతాయని అధికారులు అంటున్నారు.