ఈ లోకంలో తల్లి ప్రేమ( Mother Love )కు మించిన ప్రేమ మరొకటి లేదని గ్రంధాలు ఘోషిస్తాయి.లోకంలో చాలా ప్రేమలు ఉంటాయి.
భార్యాభర్తల ప్రేమ, యువతీ యువకుల మధ్య ప్రేమ… రకరకాల ప్రేమలు ఉంటాయి.కొన్ని ప్రేమలు అవసరాలు తగ్గ రీతిలో మారిపోతుంటాయి.
కానీ ఎప్పుడూ కూడా తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది.తాను తిన్న తినకపోయినా గానీ బిడ్డలకు మాత్రం పెట్టడంలో తల్లి ఎప్పుడూ ముందుంటుంది.
అది మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా కనిపిస్తూ ఉంటది.
ఎలాంటి కల్మషం లేనిది తల్లి ప్రేమ.
ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా( Nellore ) భగత్ సింగ్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది.గుంతలో పడిన తన కన్న పిల్లలని రక్షించి ఇద్దరు తల్లులు తమ ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
పెన్నా నది రివిట్ మెంట్ వాల్ నిర్మాణం కోసం తవ్విన గుంతలో ఇద్దరు చిన్నారులు పడిపోగా… వారి తల్లులు షాహినా, షబీనా గుంతులోకి దూకి కాపాడారు.కానీ తర్వాత వారిద్దరూ గుంతలో నుంచి పైకి రాలేకపోయారు.
బురదలో చిక్కుకుని మృతి చెందారు.