క్యాబేజీ సాగులో డౌనీ బూజు తెగులు ( downy mildew )ఫంగస్ వల్ల వ్యాపించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.వెచ్చని వాతావరణం ఉండి, నీడ అధికంగా ఉండే ప్రాంతాలలో ఈ తెగులు పంటను ఆశిస్తాయి.
ఒక్కసారి పంటకు సోకితే అధిక మొక్కలకు సోకడానికి పెద్ద సమయం పట్టదు.ఈ తెగులకు సంబంధించిన అవశేషాలు మట్టిలో, మొక్కల అవశేషాలలో జీవించి ఉంటాయి.
ఈ తెగులను ఎలా గుర్తించాలో చూద్దాం.
లేత క్యాబేజీ ఆకులపై( Cabbage ) పసుపు మచ్చలు ఏర్పడి క్రమంగా బూడిద రంగులోకి మారి మొక్కలు చనిపోతాయి.
ఈ ప్రక్రియ అంతా ఆకు అడుగు భాగంలో జరుగుతుంది.ఈ తెగుల ప్రభావంతో మొక్కల ఎదుగుదల మందగించడంతో పాటు లేత చిగుర్లు, పువ్వులు వాలిపోయి చనిపోతాయి.ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఎండ ఉన్నప్పుడు ఈ తెగులు కనిపించవు.నీడలో మాత్రమే ఈ తెగులకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడతాయి.
కాబట్టి మొక్కల మధ్య కాస్త దూరం ఉంటే సూర్యరశ్మి, గాలి అధికంగా ఉంటే పంటకు తెగులు ఆశించే అవకాశం ఉండదు.నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.పొలంలో ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేస్తూ ఉండాలి.ఏవైనా మొక్కలలో ఈ తెగులను గుర్తిస్తే వెంటనే పీకేసి కాల్చి నాశనం చేయాలి.
వ్యవసాయ రంగంలో అధిక ప్రాముఖ్యత సేంద్రీయ ఎరువులకు( Organic fertilizers ) ఇవ్వాలి.వేసవికాలంలో లోతు దుక్కులు దున్నడంతో ఒకవైపు కలుపు సమస్యలు, మరొకవైపు ఈ తెగుల సమస్యలను సగానికి పైగా అరికట్టవచ్చు.భూమి లోపలి భాగం లో సూర్యరశ్మి తగలడం వల్ల శిలీంద్రాలు, ఫంగస్ లాంటి అవశేషాలు నాశనం అవుతాయి.ఈ తెగులను సకాలంలో గుర్తించిన తర్వాత క్రిస్టల్ M-45 లేదా అబిక్ రసాయన పిచికారి మందును లీటర్ నీటిలో కలిపి మొక్కలు బాగా తడిచేలాగా పిచికారి చేయాలి.
ఒకవేళ తెగుల వ్యాప్తి అధికంగా ఉంటే ధనుక M-45 లేదా మర్లెట్ట్ M-45 రసాయనాన్ని నీటిలో కలిపి పిచికారి చేసి ఈ తెగులను అరికట్టాలి.