యూట్యూబ్ గురించి తెలియని జనాలు దాదాపుగా వుండరు.చదువుకున్న విద్యార్థులు దగ్గర నుంచి, గృహిణులు, వ్యాపారుల వరకూ అందరూ యూట్యూబ్( YouTube )కు అలవాటైనవారే.
అయితే ఈమధ్య కాలంలో యూట్యూబ్ విషయంలో చాలామందికి ఓ కంప్లైంట్ వుంది.అవే యాడ్స్.
సీరియస్‌గా ఏదో వీడియో చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఓ యాడ్ ప్లే అవుతూ ఉంటుంది.ఒక్కోసారి వాటిని స్కిప్ చేయడం కూడా కుదరదు.
ఆ సమయంలో అది చాలా చిరాకును, కోపం రావడం సహజం.
ఇక అది చాలదన్నట్టు గూగుల్( Google ) మరో కీలక ప్రకటన చేసి, అందరినీ అవాక్కయేలా చేసిందని.అతి పెద్ద యాడ్లను స్మార్ట్ టీవీ యూట్యూబ్ యాప్‌లలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.చిన్న యాడ్లే చిరాకురా బాబు అంటుంటే పెద్ద పెద్ద యాడ్స్ అంటే అదెంత విసుగ్గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
అందుకే అలాంటి యాడ్స్ స్కిప్ చేయడం ఎలాగో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.ప్రస్తుతం యూట్యూబ్‌లో యాడ్ స్కిప్ చేయాలంటే ఒకే ఒక అవకాశం ఉంది.అదే యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయడం.
ఇపుడు అదొక్కటే సొల్యూషన్ అని చెబుతున్నారు నిపుణులు.అయితే దీని కోసం పే చేయాల్సిన మొత్తం చాలా తక్కువగానే ఉంటుంది.అవును, అతి తక్కువ మొత్తంలోనే మీకు ఈ యూట్యూబ్ మెంబర్ షిప్ వస్తుంది.యూట్యూబ్ ప్రీమియం( YouTube Premium ) మెంబర్‌షిప్ యూఎస్‌లో 11.9 డాలర్లు కాగా మన దేశంలో నెలకు రూ.129గా ఉంది.ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే యూ ట్యూబ్‌లో ఎటువంటి యాడ్‌లు లేకుండా మీరు వీడియోలు చూసుకోవచ్చు.
ఒకసారి మెంబర్‌షిప తీసుకుంటే ఏ డివైజ్ నుంచైనా మీరు యాడ్ ఫ్రీ కంటెంట్ ను ఆస్వాదించవచ్చు.స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు దేనిలో అయినా యాడ్ లేకుండా చూడొచ్చన్నమాట.