ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ).తమిళ్ లో సూపర్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
తెలుగు హీరో అయినా రాజేష్ కుమార్తె ఐశ్వర్య.రాజేష్ కూతురిగా అలాగే వరలక్ష్మి మేనకోడలిగా ఈమెకు తెలుగులో బాగానే గుర్తింపు ఉంది.
కానీ రాజేష్ బతికున్న రోజుల్లో చెన్నైలోనే ఉండేవారు అప్పటికి ఇంకా సినిమా పరిశ్రమ హైదరాబాద్ కి షిఫ్ట్ కాలేదు.దాంతో అక్కడే ఆయన అనారోగ్యం బారిన పడి కన్ను మూశారు.
అయితే కుటుంబం కూడా చెన్నైలోనే స్థిరపడాల్సి వచ్చింది.దాంతో ఐశ్వర్య తమిళ ఇండస్ట్రీలోనే మొదటిసారిగా పరిచయమైంది.
మొదట టీవీలో యాంకరింగ్ చేసి ఆ తర్వాత నటిగా తానేంటో ప్రూవ్ చేసుకొని ప్రస్తుతం తమిళంలోనే మంచి హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.
కానీ తెలుగు వారి కడుపున పుట్టి తమిళంలో ఎందుకు సినిమాలు చేస్తున్నావు అంటూ రాజేష్ భార్య ఎప్పుడూ ఐశ్వర్యని అడుగుతూ ఉంటుందట.నువ్వు ఎందుకు తెలుగులో సినిమాలు చేయడం లేదు ఫిమేల్ సెంట్రిక్ రోల్స్ లో చేసి తెలుగులో పెద్ద హీరోయిన్ గా ఎదగవచ్చు కదా అంటూ ప్రతిసారి ప్రశ్నిస్తూ ఉంటారట ఐశ్వర్య తల్లి.అయితే దానికి సమాధానంగా తెలుగులో ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేయాలి అంటే తాను ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అయి ఉండాలని అలా ఇప్పటి వరకు నేను తెలుగులో పెద్ద హీరోలతోనే ఎక్కువగా నటించ లేకపోయాను అప్పుడే ఫిమేల్ సెంట్రిక్ చేయడం చాలా కష్టం అంటూ చెబుతూ వస్తున్నానని ఏ కారణాల చేతనో తెలియదు కానీ తెలుగు వారు నన్ను ఎక్కువగా ఆదరించడం లేదు అంటూ ఐశ్వర్య ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు.
తన బలం తమిళ సినిమా( Kollywood ) మాత్రమే అని, తెలుగు వారు అవకాశాలు ఇస్తేనే తాను ఇక్కడ కూడా నటించగలను అని అందుకు ఇంకా సమయం ఉండి ఉండొచ్చు అని ఐశ్వర్య తెలిపారు.ఏది ఏమైనా మన తెలుగు వారికి బయట రాష్ట్రాల నుంచి హీరోయిన్స్ ని తెచ్చుకోవడం ఎప్పటి నుంచో ఉన్న అలవాటు.అందుకే మన సొంత గూటి అమ్మాయిలను మనం పట్టించుకోవడం లేదు.కానీ తమిళంలో అలా కాదు ఎలాంటి హీరోయిన్ అయినా సరే టాలెంట్ ఉంటే వారికే పెద్ద పీట వేస్తారు.
ఇది ఐశ్వర్య విషయంలో మరోసారి నిరూపితమైంది.తెలుగులో అవకాశాలు దక్కని చాలా మంది తెలుగు హీరోయిన్స్ తమిళనాడు( Tamil Nadu )కు వలస వెళుతున్న సంగతి మనం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం
.