Shaakuntalam : శాకుంతలం సినిమా అవార్డులపై ట్రోల్స్.. సమంత కష్టం పగోడికి కూడా రాకూడదంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత9( Samantha ) తాజాగా నటించిన చిత్రం శాకుంతలం( Shaakuntalam ).ఇందులో మలయాల నటుడు దేవ్ మోహన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.

 Samantha Shaakuntalam Movie Wins International Awards-TeluguStop.com

గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదల అయిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది.సినిమా ఫ్లాప్ అవడంతో కొంతమంది సమంత పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ భారీగా ట్రోల్స్ చేశారు.ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సమంత కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.అందరి నమ్మకాలను ఈ సినిమా తలకిందులు చేసింది.నిర్మాతలను నష్టాల పాలు చేసింది.ఇది ఇలా ఉంటే ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది అంటూ నిర్మాణ సంస్థ గుణ టీం వర్క్స్ తెలిపింది.న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలమ్స్ అవార్డ్స్ 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిలింగా బెస్ట్ మ్యూజికల్ ఫిలిం గా ఈ సినిమా అవార్డులను గెలుచుకున్నప్పుడు మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఈ విషయాన్ని తెలుపుతూ గుణ( Gunasekhar ) టీమ్ వర్క్స్ ట్విట్టర్ లో ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ ని చూసిన ఫ్లాప్ అయిన నెటిజన్స్ సినిమాకు కూడా ఇన్ని అవార్డులు ఇస్తారా అంటూ కామెంట్స్ చేయడంతో పాటు ఉదాహరణంగా ట్రోలింగ్స్.ఈ సినిమా విడుదల అయ్యి నెల రోజులు కూడా పూర్తికాకముందే అప్పుడే ఓటీటీ లోకి విడుదలైన విషయం తెలిసిందే.ఆ విషయాన్ని కూడా నెటిజెన్స్ ప్రస్తావిస్తూ ఏకిపారేస్తున్నారు.కొంతమంది ఆ ట్రోల్స్ పై పాజిటివ్ గా స్పందిస్తూ సమంత కష్టం పగోడీకి కూడా రాకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube