మనం తరచూ మన పెద్దవారి నోట అదృష్టం, దురదృష్టం విషయాలను వింటూ ఉంటాం.ఐతే ఇవి కేవలం మనుషుల నమ్మాకాలపైనే పూర్తిగా ఆధారపడి ఉంటాయి.
వీటికి ఎలాంటి ఆధారాలు లేవు కనుక కొంతమంది వీటిని నమ్మరు.ముఖ్యంగా చదువరులు అస్సలు నమ్మరు.
కానీ జీవితంలో ఒక సంఘటన ఎదురైతే ఎంత నమ్మకం లేనివారికైనా అదృష్టం, కర్మలపై నమ్మకం కలుగుతాయి.తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో నమ్మకాన్ని కలిగించే జాబితాలోకే వస్తుంది.
అందుకే ఆనంద్ మహీంద్ర( Anand Mahindra ) షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి గమనిస్తే, ఓ కుర్రాడు రోడ్డు పక్కన ఉన్న గ్రిల్స్ ( Roadside Grills ) వద్ద నిల్చొని ఉండడం చాలా స్పష్టంగా చూడవచ్చు.అతగాడు సరదాగా కాసేపు అక్కడ టైం పాస్ చేసి అక్కడి నుంచి ఓ రెండు అడగులు ముందుకు వేశాడు.అంతలో అనూహ్యంగా ఓ కారు ( Car ) అటువైపుగా దూసుకొచ్చింది.
రెప్పపాటు వేగంలో వచ్చిన ఆ కారు అంతకు ముందుకు ఆ కుర్రాడు నిల్చున్న స్థలంలోనే ఢీకొట్టడం గమనార్హం.దీంతో అక్కడ ఉన్న గ్రిల్స్, స్థంబానికి ఆ కారు గుద్దుకొని తునాతునకలైంది.
ఆ సమయంలో ఆ కుర్రాడు అక్కడే నిల్చొని ఉంటే భారీ నష్టం జరిగేది.ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీటీవీలో రికార్డ్ కాగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.మరి ఆ వీడియో పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర కంట ఎలా పడిందో మనకు తెలియదు కానీ, ఆ వీడియోను రీట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్ర.కర్మ గురించి చెప్పుకొచ్చారు.
కర్మ, డెస్టినిలాంటి వాటిపై మీకు నమ్మకం లేకపోతే ఈ వీడియో మీ ఆలోచనను మార్చేస్తుంది… అంటూ రాసుకొచ్చారు.దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు నిజంగానే ఆ కుర్రాడు అదృష్ట వంతుడు, రెప్పపాటు క్షణంలో బతికిపోయాడు అని కామెంట్స్ చేయడం ఇక్కడ గమనించవచ్చు.