దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ( Telugu Desam Party ) వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు వందవ జయంతి సందర్భంగా నిర్వహించిన శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth )పాల్గొన్న విషయం తెల్సిందే.ఆ సమయంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ప్రశంసల వర్షం కురిపించాడు.
అంతే కాకుండా ఎన్టీఆర్ ను పొగడ్తల వర్షం కురిపించారు.జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న స్టార్ రజినీకాంత్.
అలాంటి రజినీకాంత్ ను వైకాపా కు చెందిన కొందరు నాయకులు అత్యంత దారుణంగా మాట్లాడాడు.కొడాలి నాని మాట్లాడుతూ సిగ్గు శరం ఉందా అంటూ ప్రశ్నించాడు.
అంతే కాకుండా రజినీకాంత్ కు ఏం తెలుసు అంటూ చంద్రబాబు ( Chandrababu )ను గురించి మాట్లాడారు అంటూ ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి ఈ వ్యవహారం లో తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
రజినీకాంత్ ను విమర్శించడం పట్ల జాతీయ స్తాయి లో వైకాపా శ్రేణులను టార్గెట్ చేస్తూ తెలుగు దేశం పార్టీ అధినేత స్పందించడం జరిగింది.అంతే కాకుండా వైకాపా వారి యొక్క తీరును తమిళనాట కూడా తెలిసే విధంగా వార్తల ప్రసారం జరిగింది.వైకాపా( YCP ) యొక్క అభిమానులు ప్రస్తుతం వైకాపా ను సోషల్ మీడియా లో టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.సూపర్ స్టార్ రజినీకాంత్ ను విమర్శించడం ద్వారా వైకాపా అడ్డంగా బుక్ అయ్యింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
వైకాపా ను రజినీకాంత్ కనీసం ఒక్క మాట కూడా అనలేదు.అయినా కూడా మరీ ఇంత నీచంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ కొందరు న్యూట్రల్ గా ఉండే వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా రంగానికి చెందిన వారు వైకాపా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.రజినీకాంత్ తనకు ఉన్న అభిమానంతో ఆయన్ను పొగడటం సరే.వైకాపా వారు దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.