అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేస్తారన్న ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తేనే స్పందన లేదని తెలిపారు.
స్పందనలో ఏం చెప్పినా ప్రయోజనం లేదని జేసీ విమర్శించారు.దేశంలో నంబర్ వన్ మున్సిపాలిటీని నాశనం చేశారని ఆరోపించారు.
ఇసుక అక్రమాలపై హైకోర్టు ఆదేశాలు అమలు చేయడం లేదని చెప్పారు.రెండు రోజుల్లో స్పందించకపోతే కలెక్టర్ కాళ్లు పట్టుకుంటానని వెల్లడించారు.