అక్కినేని నాగేశ్వర రావు( Akkineni Nageswara Rao ) చాలా నికార్సైన మనిషి.అయన తన జీవితంలో ఎన్నో రకాల కష్టాలను చూసి, అన్నింటిని దాటుకొని నిలబడ్డారు.
కెరీర్ పీక్ లో ఉన్న టైం లో గుండె సంబంధిత వ్యాధితో బాధ పడ్డారు.అక్కినేని కి అమెరికా ( America )లో ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది.1980 ఆ టైం లో ఈ ఆపరేషన్ జరగగా అప్పట్లో ఇదొక సెన్సేషన్ అని చెప్పుకోవాలి.అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఎలా అయితే ఉదృతంగా పని చేస్తుందో అప్పట్లో మీడియా బాగా గట్టిగా పని చేసేది.
వారు ఏం చెప్పిన అవే నిజం అని జనాలు కూడా నమ్మేవారు.
ఒక్కోసారి మీడియా రాతలు ఎలా ఉండేవి అంటే అక్కినేని గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్తే ఎదో ఒక జంతువు గుండెను ఆయనకు అమర్చి ఆపరేషన్ చేసారని దారుణమైన గాసిప్ లు రాసేవారు.అలా చిన్న చిన్న విషయాలను అక్కినేని గురించి మీడియా చిలువలు పలువలుగా రాయడం తో ఆయనకు మొదటి నుంచి మీడియా పైన మంచి అభిప్రాయం లేదు.ఇలా అయన ఆపరేషన్ పై ఎవరికి నచ్చింది వారు రాయడం తో అమెరికా నుంచి ఇండియా కు రాగానే ఆయనకు జరిగిన ఆపరేషన్ గురించి ఒక మీడియా సమావేశం పేటి డ్రెస్ విప్పి ఆయనకు జరిగిన ఆపరేషన్ గురించి సవివరంగా తెలియచేసారు.
అంతలా అసహనం ఉండేది మీడియా పైన అక్కినేని కి.ఇక చాల సార్లు అయన హాస్పిటల్ కి వెళ్లడం మీడియా ఆయన చనిపోయినట్టుగా కూడా రాయడం జరిగాయి.
రెండు మూడు సార్లు అక్కినేని కన్నుమూత అంటూ పతాక శీర్షికలు వచ్చాయి.అయన 2014 లో జనవరి లో అక్కినేని క్యాన్సర్ తో కన్ను మూసారు.అయితే అక్కినేని కి క్యాన్సర్ సోకింది అని తెలియగానే మరొకసారి మీడియా సమావేశం పెట్టిన అక్కినేని తనకు వచ్చిన వ్యాధి గురించి తెలియచేసారు.తాను ఇంకా ఎక్కువ రోజులు బ్రతకను అని, అందువల్ల ఎవరికి నచ్చింది వారు రాసుకోవద్దు అని, ఒక సంపూర్ణమైన జీవితాన్ని చూసాను అని, ఆర్థిక క్రమశిక్షణ తో డబ్బు కూడా బాగానే సంపాదించాను అని, అందువల్ల తన చావు గురించి దయచేసి తక్కువ చేసి రాయద్దు అంటూ మీడియా వారికి తెలిపారు.