థియేటర్‌లోకి వెళ్లిన దుప్పి.. ఆపై పాప్-కార్న్ నమిలేసింది.. వీడియో చూస్తే నవ్వే నవ్వు!

ఒక్కోసారి జనావాసాల్లోకి అనుకోని అతిథుల వలె జంతువులు ఎంట్రీ ఇస్తుంటాయి.కౄర జంతువులతో పాటు ఎలాంటి హాని తలపెట్టని జింకలు, కుందేళ్లు, గాడిదలు, గుర్రాళ్లు కూడా ప్రవేశిస్తూ ఆశ్చర్యపరుస్తుంటాయి.

 Moose Went To The Theater And Chewed Popcorn , Moose , Viral News, Viral Video,-TeluguStop.com

విదేశాల్లో కాకుండా మనదేశంలో కూడా ఇలాంటి సంఘటనలు అటవీ ప్రాంతానికి సమీపాన ఉన్న గ్రామాల్లో జరుగుతుంటాయి.అయితే తాజాగా అలాస్కాలోని ఒక థియేటర్‌లో( theater in Alaska )కి దుప్పి( moose ) వచ్చింది.

అంతేకాదు అది ఆ థియేటర్ అంతా తిరుగుతూ పాప్‌కార్న్( Popcorn ) ఎంచక్కా తినేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

థియేటర్‌లో పని చేసే ఉద్యోగులను ఈ దుప్పి ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ సంఘటన నిఘా ఫుటేజీలో రికార్డ్ అయింది.ఈ వీడియోలో లేడి లాంటి ఆ జంతువు చిరుతిండిని కనుగొనే ముందు థియేటర్ అంతా తిరిగింది.అయితే శీతాకాలంలో బెరడు తిని తిని బాగా అలసిపోయి ఉంటుందని, అందుకే పాప్‌కార్న్ తినాలనిపించిందేమో అని థియేటర్ మేనేజర్ చమత్కరించారు.

స్వచ్ఛమైన గాలి కోసం ఒక తలుపు తెరిచి ఉండగా.ఆ ద్వారం నుంచే జంతువు భవనంలోకి ప్రవేశించగలిగింది.

తిన్న తర్వాత, ఒక ఉద్యోగి హానిచేయని ఆ దుప్పిని బయటికి మళ్లించాడు.అది ఎద్దు లేదా పెద్ద దుప్పి అయితే తమ స్పందన మరోలా ఉండేదని మేనేజర్ తెలిపాడు.ఏప్రిల్ 19న అలాస్కాలోని కెనై సినిమాస్‌లో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.ఈ ఘటనకు సంబంధించి 53 సెకన్ల నిడివి గల ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు బాగా నవ్వుకుంటున్నారు.

ఇంకొందరు ఆ దుప్పిని థియేటర్‌లో కూర్చోపెట్టి సినిమా కూడా చూపించండని సరదాగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube