ప్రియుడి తండ్రితో లేచిపోయిన యువతి.. ప్రియుడికి ఊహించని షాక్..!

సాధారణంగా యువతి, యువకులు ప్రేమించుకుని ఒకటి కావాలనుకోవడం మామూలే.కొందరు ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటే.

 A Young Girl Who Woke Up With Her Boyfriend's Father An Unexpected Shock For Her-TeluguStop.com

కొందరు పెద్దలు నిరాకరించడంతో పారిపోయి వివాహం చేసుకుంటారు లేదంటే ప్రేమకు బ్రేకప్ చెప్పేసి ఇంట్లో చూసిన సంబంధాన్ని చేసుకుంటారు.ఇలాంటివి రోజు చూస్తూనే ఉన్నాం.

కానీ ఓ యువతి లవ్ స్టోరీ ( love story )మాత్రం చాలా క్రియేటివ్ గా ఉంది.ఒక యువకుడిని ప్రేమించి, సినిమాలు షికార్లు మొత్తం అయిపోయాక చివరికి ఆ యువకుడి తండ్రితో లేచిపోయి ప్రియుడికి షాక్ ఇచ్చింది.

ఈ విషయం వింటుంటేనే చాలా కొత్తగా అనిపిస్తుంది.ఇంతకీ ఆ యువతి ప్రేమించింది ఆ యువకుడినా లేదంటే ఆ యువకుడి తండ్రినా.

అసలు ఆ లవ్ స్టోరీ కు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.

కాన్పూర్ లో కమలేష్( Kamlesh in Kanpur ) అనే వ్యక్తికి 21 ఏళ్ల అమిత్( Amit ) కుమారుడు ఉన్నాడు.అమిత్ అదే ప్రాంతంలో ఉండే ఓ యువతిని ప్రేమించి దాదాపుగా రెండు సంవత్సరాల పాటు ప్రేమలో మునిగితేలాడు.వీరి ప్రేమ వ్యవహారం ఇద్దరి కుటుంబాలలో తెలియడంతో పెళ్లికి వ్యతిరేకించలేదు.

కానీ చిన్న వయసులో పెళ్లి ఎందుకు కొన్నేళ్లు ఆగిన తర్వాత పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.ఆ తర్వాత కాబోయే కోడలు కమలేష్ ఇంటికి వస్తూ పోతూ ఉండేది.

ఇక కమలేష్( Kamlesh ) తో ఆ యువతి కి పరిచయం పెరిగి ఎక్కువగా మాట్లాడుకునేవారు.అమిత్ కూడా మాట్లాడేది నా తండ్రి తోనే కదా అనుకొని పెద్దగా పట్టించుకోలేదు.

ఈ క్రమంలో ఇటీవలే సాయంత్రం ప్రియురాలితో మాట్లాడిన అమిత్ కు పొద్దున నిద్రలేచేసరికి ఊహించని షాక్ తగిలింది.తన తండ్రి కమలేష్ తో తన ప్రియురాలు లేచిపోయిందనే విషయం తెలిసి హడలిపోయాడు.

ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వారు కూడా షాక్ కు గురై చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు మిస్సింగ్ కేస్ నమోదు చేసి ఎట్టకేలకు జంటను అదుపులోకి తీసుకొని, యువతికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube